ఆమె వారి నుంచి తప్పించుకుని రోడ్డుపై పరుగులు పెట్టారు. అయినా వాళ్లు ఆమెను వదల్లేదు. ఆమె వెంటపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సినిమాల్లో కంటే వివాదాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు బాలీవుడ్ నటి రాఖీ సావంత్. తరచూ ఏదో ఒక గొడవతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటారు. ఆదిల్ ఖాన్‌తో ప్రేమ, పెళ్లి.. కొన్ని నెలలకే విడాకులు ఇలా ప్రతీ విషయం మీడియాలో వార్తగా మారిపోయింది. కొన్ని రోజుల ముందు వరకు ఆదిల్‌తో గొడవలతో రాఖీ మీడియాలో తెగ హల్‌చల్ చేశారు. ప్రస్తుతం భర్తకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆమె వివాదాలు.. మీడియాకు దూరంగా ఉండాలని ఎంత అనుకుంటున్నా.. మీడియా వాళ్లు మాత్రం ఆమెను వదలటం లేదు. ముఖ్యంగా పాపరజీలు ఆమె వెంట పడి ఫొటోలు, వీడియోల కోసం వేధిస్తున్నారు.
దీంతో ఆమె వారినుంచి తప్పించుకుని తిరగటానికి నానా తిప్పలు పడుతున్నారు. తాజాగా, ఆమె ముంబైలోని ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. షాపింగ్ ముగించుకుని బయటకు వచ్చారు. ఆమె కోసం బయట వేచి ఉన్న పాపరజీలు ఒక్కసారిగా ఫొటోలు, వీడియోల కోసం ఆమె చుట్టూ మూగారు. దీంతో ఆమెకు చిర్రెత్తు కొచ్చింది. వారి నుంచి తప్పించుకుని రోడ్డుపై పరుగులు పెట్టారు. మారథాన్ రన్నింగ్ చేసినట్లు పరుగులు పెట్టారు. దీంతో వారు ఆమె వెంటపడ్డారు. ఆమెతో పాటే పరుగులు తీశారు.
‘నా వెంట రాకండి.. పోండి’ అంటూ ఆమె వారిని బతిమాలింది. పరుగులు తీసే ఓపిక లేక ఓ చోట ఆగిపోయింది. రాఖీ వెంట పడ్డ పాపరజీలు.. ఆమె ఆగగానే ఫొటోలు, వీడియోలు తీసుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ పాపం రాఖీకి ఇదేం ఖర్మ..’’..‘‘ కొంతమంది జీవితం అంతే.. ఎంత దూరం పరిగెత్తినా లాభం ఉండదు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
welcome to another episode of “rakhi being relatable” 😭 pic.twitter.com/fIYLpQut2o
— S. | *RRR enthusiast* (@AlwaysSherrry) June 15, 2023