తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత బుల్లితెరపై ఆమె తన సత్తా చాటారు. నటిగా, నిర్మాతగా ఆమె సినీపరిశ్రమకు చేసిన సేవలు మరువలేనివి. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం కుర్ర హీరోలకు తల్లిగా నటిస్తూ మెప్పిస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవితో ఆమె ఎన్నో చిత్రాల్లో నటించారు. వీరిద్దరు కలిసి నటించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.
రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో వీరిద్దరి మధ్య స్నేహ బంధం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. బయట పార్టీలో కలిసినా.. ఒకరింటికి మరొకరు వెళ్లిన ఈ స్నేహితులు ఇద్దరు చేసే సందడి అంతాఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి గురించి రాధిక మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఎన్నో అవరోధాలు అధిగమించి మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి.. ఆయన బాటలో ఇప్పుడు ఎంతో మంది హీరోలు నడుస్తున్నారని అన్నారు. ఇప్పటికీ ఆయన తన కష్టాన్నే నమ్ముకుంటారు.. ఎంత పెద్ద మెగాస్టార్ అయినా ఒదిగి ఉంటారు. అదే ఆయనలో ఉన్న గొప్పతనం అన్నారు.
ఇప్పటికీ తాము ఎక్కడ కలిసినా చిన్నపిల్లాడిలా మారిపోయి అల్లరి చేస్తుంటారు అని చెప్పుకొచ్చింది. ఒకవేళ ఇప్పుడు చిరంజీవితో నటించే అవకాశం వస్తే ఎలాంటి పాత్రలో నటిస్తారు అన్న ప్రశ్నకు సమాధానంగా.. అలాంటి అవకాశం వస్తే ఆయనకు విలన్ గా అయినా నటిస్తాను కానీ ఎట్టి పరిస్థితిలో తల్లి పాత్రలో నటించలేను అని అన్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.