సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో లైంగిక వేధింపులు ఒకటి. మహిళలు.. తాము పనిచేస్తున్న ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. కొందరు తోటి ఉద్యోగులు మహిళలను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఇక సినిమా వారికైతే లైంగిక వేధింపులు చాలా ఎక్కువగా ఉంటాయనేది అందరికి తెలిసిన విషయమే. “మీ టు” ఉద్యమం ద్వారా అనేక మంది నటీమణులు ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ సమస్యలను బయట పెట్టారు. ఇలా పలువురు నటీమణులు ఇండస్ట్రీలో తమకు ఎదురైన లైంగిక వేధింపులక గురించి ఒక్కొక్కరు బయటపెట్టడంతో పెద్ద దుమారమే రేగుతుంది. తాజాగా క్యారెస్ట్ ఆర్టిస్ట్ రాధా ప్రశాంతి ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను బయట పెట్టారు. 1990ల్లో అనేక సినిమాలో అనేక క్యారెక్టర్స్ లో నటించి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఓ ఇంటర్వ్యూల్లో పాల్గొన్న ఆమె.. తనకు సినిమా విశేషాలతో , తన సినీ కెరీర్ లో ఎదురైన చేదు అనుభవాలను సైతం తెలిపింది.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైనారు రాధా ప్రశాంతి. ముఖ్యంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలో రాధా ప్రశాంతి అనేక విభిన్నమైన పాత్రలు పోషించింది. చాలా కాలం నుంచి అంతగా కనిపించని రాధా ప్రశాంతి.. ఓ ఛానల్ ఇంటర్వ్యూ పాల్గొన్నారు. తన సినీ కెరీర్ గురించి అనేక విషయాలు వెల్లడించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ” నేను ఓ సినిమాలో జమీందారు భార్యగా నటించాను. ఇక ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. ఓ రోజు అర్ధరాత్రి ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర్ నుంచి ఫోన్ వచ్చింది. అయితే ఆ సమయంలో నేను కాకుండా మా సోదరుడు ఫోన్ ఎత్తాడు. ఎవరు మాట్లాడుతున్నారు అని అడగ్గా.. ఏం పేరు చెప్తేనే ఫోన్ ఇస్తావా? అంటూ కఠినంగా మాట్లాడాడు.
ఆ తరువాత నేను ఫోన్ తీసుకుని మాట్లాడాను. సినిమాకు సంబంధించిన ఓ విషయం మాట్లాడాలి గెస్ట్ హౌస్ కు రండి.. అని మేనేజర్ అన్నారు. అయితే నా షెడ్యూల్ అయిపోయింది కదా.. ఈ సమయంలో ఎందుకు అని ప్రశ్నించాను. ఇక్కడ నిర్మాత, దర్శకుడు, హీరో సిట్టింగ్ లో ఉన్నారు. మీరు కూడా రండి అన్నారు. దీంతో వాళ్లు ఉండటం సహజం.. నేను ఎందుకు రావలన్నాను. అయితే చివరకు మా తమ్ముడి తో కలిసి వెళ్లాలను. అక్కడి వెళ్లిన తరువాత వేరే ఆర్టిస్ట్ కు చేయబోయి.. మీకు చేశారని పక్కనే ఉన్న కొందరు అన్నారు. దీంతో మేము తిరిగి ఇంటికి వచ్చేశాము.ఇక మరో షెడ్యూల్ సమయంలో.. ఒక పల్లెటూరులో పంచాయతీ సీన్ కు సంబంధించి షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ విరామం సమయంలో నేను అక్కడే ఉన్న ఒక గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకుంటూ ఉండగా ఆ సినిమా మేనేజర్ నన్ను చూడడం జరిగింది. లేడీస్ బట్టలు మార్చుకుంటుంటే మీరు గదిలో రావడమేంటని నేను కోపంతో ఆ మేనేజర్ ని ప్రశ్నించాను.
పెద్ద పెద్ద వాళ్లకే ప్రత్యేక గదులు లేవని, వారే చెట్టు, పుట్టల చాటుకు వెళ్లి దుస్తులు మార్చుకుంటారని సినిమా అంటే అన్నిటికి సిద్ధపడే రావాలని అన్నాడు. అప్పుడు గెస్ట్ హౌస్ లో అలా ప్రవర్తించి.. ఇప్పుడు ఈ విధంగా ప్రవర్తించడంతో నాకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే వాడి చెంప చెల్లుమనిపించాను. అయితే ఇప్పుడు ఆ మేనేజర్ ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారు” అని రాధాప్రశాంతి తెలిపారు. తాను ముక్కుసూటిగా ఉండటం వలన హీరోయిన్ గా చాలా అవకాశాలు మిస్ అయ్యానని ఆమె తెలిపారు. మరి.. రాధాప్రశాంతి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.