నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్ స్టాపబుల్‘. మొదటి సీజన్ ముగించుకొని సెకండ్ సీజన్ లో దూసుకుపోతుంది. ఓవైపు సినిమాలలో యాక్టీవ్ గా ఉంటూనే.. మరోవైపు అన్ స్టాపబుల్ షో ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు బాలయ్య. ఈ క్రమంలో ‘అన్ స్టాపబుల్ 2’కి బాలయ్య ఫ్రెండ్స్.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలతో పాటు నటి రాధికా శరత్ కుమార్ పాల్గొన్నారు. ఇక ఫ్రెండ్స్ రాకతో ఎన్నో సరదా, సీరియస్ కబుర్లు మాట్లాడిన బాలయ్య.. నటి రాధికాని ఓ సీరియస్ ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకి రాధికా షాకింగ్ ఆన్సర్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది.
బాలయ్య రాధికతో మాట్లాడుతూ.. “నీకో సీరియస్ ప్రశ్న. పిల్లలు పుట్టాలంటే పెళ్లి చేసుకోవాల్సిందేనా?” అని అడిగాడు. దీనిపై రాధికా స్పందిస్తూ.. ‘ఇప్పుడు జనరేషన్ లో చాలా మార్పులు వచ్చేశాయి. అసలు పెళ్లి టాపిక్ అనేది పెద్ద సమస్య అయిపోయింది. అమ్మాయిలకు ఫైనాన్సియల్ సపోర్ట్ వచ్చాక.. ఆడ, మగ అనే భావాలు మారిపోయాయి. రీసెంట్ గా నేను కొంతమంది అమ్మాయిలు, యంగ్ హీరోయిన్స్ తో మాట్లాడాను. వాళ్లంతా పెళ్లి చేసుకొనే పిల్లలు కనడం ఎందుకు? సరోగసి ఉంది.. ఐవిఎఫ్ మార్గాలు ఉన్నాయి. మాకు మగాళ్లు అవసరం లేదని అంటున్నారు. వాళ్ళ మాటలు విని నేను షాకయ్యాను. ఈ జనరేషన్ మైండ్ మారిపోయింది.” అని చెప్పింది.
ఆ వెంటనే బాలయ్య స్పందిస్తూ.. “నేను కొంతమంది అమ్మాయిలతో మాట్లాడాను. చాలామంది అమ్మాయిలు ఫ్యామిలీ ప్రెషర్, సోషల్ ప్రెషర్ వల్ల మేం పెళ్లిళ్లు చేసుకోము. పిల్లల్ని కనం. మాకు డెసిషన్ తీసుకునే పవర్ కావాలి. ఆ పవర్ కోసం చదువు.. ఫైనాన్సియల్ ఇండిపెండెన్స్ కావాలి. ఆ తర్వాత మేం పెళ్లి చేసుకుంటామో చేసుకోమో, పిల్లల్ని కంటామో కనమో మా ఇష్టం అన్నారు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పెళ్లి, పిల్లలు టాపిక్ పై రాధికా, బాలకృష్ణ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి రాధికా, బాలయ్య చెప్పినట్లుగా పెళ్లి, పిల్లల విషయంలో ఈ జనరేషన్ ఆలోచనా విధానం సరైనదేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.