గ్లోబల్ స్టార్, ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. ఓసారి తనని తానే చూసుకుని తెగ భయపడిపోయింది. మళ్లీ తర్వాత మాములు మనిషి అయింది. అది వేరే విషయం. ఇంతకీ భయపడాల్సినంతగా ఏం జరిగింది?
హీరోయిన్లు గ్లామరస్ గా కనిపించేందుకు చాలా కష్టపడుతుంటారు. శరీరంలోని పలు భాగాలకు సర్జరీ చేసుకోవడం దగ్గర నుంచి షూటింగ్స్ టైంలో ఉపవాసం ఉండటం లాంటివి చేస్తుంటారు. అయితే సందర్భం వచ్చినప్పుడు తప్పితే.. వాటిని పెద్దగా బయటపెట్టరు. ఈ జాబితాలో హీరోయిన్లు చాలామంది ఉంటారు. అయితే మన దేశంలోనే పుట్టి వరల్డ్ వైడ్ పాపులారిటీ దక్కించుకున్న ప్రియాంక చోప్రా.. తనకు జరిగిన ఓ సర్జరీ గురించి బయటపెట్టింది. అది జరిగిన తర్వాత చాలా భయపడ్డానని అప్పటి విషయాన్ని గుర్తుచేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మన దేశంలోనే పుట్టిపెరిగిన ప్రియాంక చోప్రా, 2000లో మిస్ వరల్డ్ గా నిలిచింది. ఆ తర్వాత తమిళంలో ఓ సినిమాతో హీరోయిన్ గా మారింది. అనంతరం బాలీవుడ్ లో వరస ఛాన్సులు దక్కించుకున్న ప్రియాంక హీరోయిన్ గా స్టార్ హోదా దక్కించుకుంది. ఇక అమెరికన్ పాప్ సింగర్ నిక్ జొనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మాలతి అనే పాపకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం వీరంతా లండన్ లో ఉంటున్నారు. హాలీవుడ్ మూవీస్ చేస్తూ ఇప్పటికీ బిజీగా ఉన్న ప్రియాంక.. ‘సిటాడెల్’తో త్వరలో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ క్రమంలోనే ప్రియాంక ముక్కు సర్జరీకి సంబంధించిన ఓ విషయం బయటకొచ్చింది.
‘నా ముక్కుకి సర్జరీ చేసే టైంలో డాక్టర్ కాస్త బ్యాలెన్స్ తప్పాడు. దీంతో నా ముక్కు షేర్ పూర్తిగా మారిపోయింది. బ్యాండేజీ తీయగానే నా ముక్కు చూసి అమ్మ, నేను భయపడిపోయాం. అది వంకరగా మారిపోయి నా ముఖమే మరోలా కనిపించింది. అసలు నేను నేనులానే లేను. అద్దంలో చూసుకున్నప్పుడు వేరే ఎవరో నన్ను చూస్తున్నట్లుండేది. హెల్ప్ లెస్ గా ఉండిపోయాను. నా సెల్ఫ్ రెస్పెక్ట్ మంటగలిసినట్లు అయింది. తిరిగి కోలుకుంటానని అనుకోలేదు’ అని ప్రియాంక చోప్రా.. తన ఆత్మకథ ‘అన్ ఫినిష్డ్’లో రాసుకొచ్చింది. మరి ప్రియాంక చెప్పిన దానిపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.