తెలుగు ఇండస్ట్రీలో మొదట 2003లో ‘ఎవరే అతగాడు?’ సినిమాతో తెరంగేట్రం చేసినా.. ప్రేక్షకులకు పెద్దగా చేరువ కాలేకపోయింది. ఆ తర్వాత జగపతిబాబు హీరోగా నటించిన ‘పెళ్లైన కొత్తలో’ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ సరసన ‘యమదొంగ’ చిత్రంతో హీరోయిన్ నటించి టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. అప్పటి వరకూ తెలుగింటి అమ్మాయిలా సంస్కారవంతంగా ఉన్న ప్రియమణి.. నితిన్ హీరోగా నటించిన ‘ద్రోణా’తో గ్లామర్ డాల్ అవతారమెత్తింది. కేవలం హీరోల సరసన హీరోయిన్ క్యారెక్టర్లే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలవైపు దృష్టి సారించింది.
తెలుగు చిత్రాలతో పాటు మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా నటిస్తోంది. అటు తమిళంలో కూడా మేటి హీరోయిన్స్‌లో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకుంది. ఫ్యామిలీ మెన్ సిరీస్ తనకు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇటీవల వెంకటేష్‌తో నటించిన ‘నారప్ప’ ఓటీటీలో విడుదలై పాజిటివ్ టాక్ దక్కించుకోవడమే కాకుండా ప్రియమణి చేసిన సుందరమ్మ క్యారెక్టర్‌కి చక్కటి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా చేస్తున్న ప్రియమణికి.. వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. దీంతో తన సెకండ్ ఇన్నిండ్స్‌ను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ వస్తోంది ఈ భామ. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్, ‘నారప్ప’ ‘విరాట పర్వం.. సినిమాలో నటించిన ప్రియమణికి మరో క్రేజీ కాంబోలో అవకాశం వచ్చిన్నట్లు తెలుస్తుంది.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఓ మూవీలో నటించబోతున్న విషయం తెలిసిందే.. మొదట ఈ సినిమా షూటింగ్ ను దసరా నుండి ప్రారంభించాలని అనుకున్నారు. స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది అని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు ఈ మూవీలో మరో స్టార్ హీరోయిన్ ప్రియమణి నటించబోతుందట. ఈ పాత్ర టోటల్ సినిమాకే కీ రోల్ అని టాక్ వినిపిస్తోంది. ఇందుకు ప్రియమణి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఈ మూవీలో ప్రియమణి ఎలాంటి పాత్రలో కనిపించబోతుందా అని అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.