సీనియర్ హీరోయిన్ ప్రేమకు కన్నడతో పాటు తెలుగు నాట కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ కూడా పలు హిట్ ఫిల్మ్స్‌లో నటించి ప్రేక్షకుల ఆదరణను ఆమె సొంతం చేసుకున్నారు.
సీనియర్ నటి ప్రేమకు టాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ‘దేవి’ చిత్రంతో తెలుగు నాట బాగా పాపులర్ అయిన ప్రేమ.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చి ఈస్థాయికి చేరుకున్నారు. పేరుకు ఆమె కన్నడ హీరోయిన్ అయినా.. తెలుగు ఆడియెన్స్ ఎంతగానో ఆదరించారు. చాన్నాళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న ప్రేమ రీఎంట్రీ కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక, కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడు ప్రేమ చాలా వరకు ఉపేంద్ర సినిమాల్లో ఎక్కువగా నటించారు. ఉపేంద్ర డైరెక్ట్ చేసిన సినిమాలతో పాటు ఇతర దర్శకుల చిత్రాల్లో ఆయన హీరోగా యాక్ట్ చేసిన మూవీస్‌లోనూ ప్రేమ నటించారు.
ఉపేంద్ర-ప్రేమ వరుసగా సినిమాల్లో కలసి నటించడంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అటు కన్నడ మీడియాలోనే కాదు.. తెలుగు నాట కూడా వార్తలు గుప్పుమన్నాయి. అప్పటికే పెళ్లయిన ఉపేంద్రతో లవ్ ఎఫైర్ ఏంటంటూ ఆమెను పలువురు విమర్శించారు. వీటిపై తాజాగా ప్రేమ స్పందించారు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేమ ఈ రూమర్స్ మీద ఓపెన్ అయ్యారు. ఉపేంద్రతో లవ్ ఎఫైర్ గురించి రాసిన వారినే అడగాలన్నారు. కలసి పనిచేసినప్పుడు రూమర్స్ సాధారణమేనని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
రూమర్స్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని ప్రేమ చెప్పారు. రాసిన వారు ఎవరూ తనను సంప్రదించలేదని.. అలా చేసి ఉంటే బాగుండేదన్నారామె. అయినా ఈ విషయాన్ని తాను లైట్ తీసుకున్నట్లు ప్రేమ పేర్కొన్నారు. దీనిపై ఉపేంద్రతోనూ తాను ఎప్పుడూ మాట్లాడలేదని ఆమె తెలిపారు. మరోవైపు ఉపేంద్ర దర్శకత్వం మీద ప్రేమ ప్రశంసలు కురిపించారు. ఆయన చాలా కచ్చితమైన డైరెక్టర్ అని.. సహజత్వానికి పెద్ద పీట వేస్తారన్నారు. మేల్ ఆర్టిస్టు, ఫిమేల్ ఆర్టిస్టు అనే తేడాలు చూపించరని.. తనకు కావాల్సిన ఔట్పుట్ వచ్చేంత వరకు ఎవర్నీ వదలరని ప్రేమ తెలిపారు. హీరోయిన్లను లాగి కొట్టాలంటే అలాగే చేయాలని.. పైపైన చేస్తే ఒప్పుకునేవారు కాదన్నారు. ఉపేంద్రతో పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నానని ప్రేమ చెప్పుకొచ్చారు.