తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది కన్నడ బ్యూటీలో అడుగు పెట్టారు. కానీ కొంతమంది స్టార్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు నటి సౌందర్య కోట్ల మంది తెలుగు అభిమానుల మనసు దోచింది. ఇప్పటికీ ఆమెను తెలుగు అమ్మాయిగానే భావిస్తుంటారు. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో నటి ప్రేమకు మంచి పేరు వచ్చింది. ముఖ్యంగ దేవీ చిత్రంతో ఈమెను తెలుగు అమ్మాయిగానే భావించారు అభిమానులు.
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది ఇతర భాష హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ముఖ్యంగా మాలీవుడ్, కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చినవారు స్టార్ హీరోయిన్లుగా చెలామణి అయ్యారు. అలాంటి హీరోయిన్స్ లో నటి ప్రేమ ఒకరు. తెలుగు లో కోడీ రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి చిత్రంతో బాగా పాపులర్ అయ్యింది ప్రేమ. కన్నడ ఇండస్ట్రీలో 1995 లో సవ్యసాచి చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఓంకారం చిత్రంతో ఘనవిజయం అందుకుంది. కన్నడనాట శివరాజ్ కుమార్, విష్ణువర్థన్, ఉపేంద్ర లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది నటి ప్రేమ. తాజాగా నటి ప్రేమ సుమన్ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో కన్నడ హీరోయిన్లు ఎంతో మంది మంచి సక్సెస్ సాధించి నెంబర్ వన్ హీరోయిన్లుగా చెలామణి అయ్యారు. కన్నడ హీరోయిన్ సౌందర్య తర్వాత ఆ స్థాయిలో మంచి పేరు సంపాదించింది నటి ప్రేమ. వెంకటేష్ హీరోగా నటించిన ధర్మచక్రం చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి చిత్రంలో టైటిల్ రోల్ పోషించింది. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది ప్రేమ. అప్పట్లో చాలా మంది ప్రేమ తెలుగు అమ్మాయిగానే భావించారు. తన అందం, అభినయంతో వరుస ఛాన్సులతో దూసుకు పోయింది. 1995 నుంచి 2009 వరకు కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి హిట్ చిత్రాల్లో నటించింది ప్రేమ.
హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే 2006 లో ప్రముఖ వ్యాపార వేత్త జివన్ అప్పచు ని వివాహం చేసుకుంది. వివాహం జరిగిన తర్వాత కొన్ని చిత్రాల్లో నటించింది ప్రేమ. అయితే హీరోయిన్ గా చాన్సులు తగ్గిపోవడంతో నటనకు బ్రేక్ ఇచ్చింది. కొంత కాలం తర్వాత వ్యక్తిగత విభేదాల కారణంగా 2016 లో భర్త నుంచి విడాకులు తీసుకుంది ప్రేమ. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. నా జీవితంలో పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లోకి తీసుకు రాను.. నాకు నచ్చలేదు అంటే దాన్ని పూర్తిగా ఖండిస్తాను. నా వైవిహిక జీవితంలో కూడా అదే జరిగింది.. నాకు ఉన్న ఇబ్బందులు నా కుటుంబానికి చెప్పి విడాకులు తీసుకున్నాను. ఇక రెండో పెళ్లిపై రక రకాల పుకార్లు వచ్చాయి.. అవి ఎలా రాస్తారో వారికే తెలియాలి. ప్రస్తుతం నేను బెంగుళూరులో ఒంటరిగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను. ఎలాంటి వదంతులు నమ్మోద్దు అన్నారు. ఇండస్ట్రీలో నాకు నచ్చిన పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను అన్నారు. నటి ప్రేమ పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ క్రింద వీడియో క్లిక్ చేయండి.