సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు పెళ్లి వార్త చెప్పినప్పటి నుండి సోషల్ మీడియాలో, అభిమానులలో కనిపించే హడావిడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ పెళ్లి చేసుకొని ప్రెగ్నన్సీ కబురు వినిపించారంటే చాలు. ఇక అభిమాన హీరోయిన్ కి పుట్టబోయేది పాపా, బాబా అని ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. అలాగే హీరోయిన్స్ సైతం ప్రెగ్నన్సీ తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ప్రతి విషయాన్నీ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. హీరోయిన్ ప్రణీత సుభాష్ కూడా అదే చేసింది.
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా తమ సీమంతం, బేబీ బంప్ ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం ట్రెండ్ అయిపోయింది. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్ ప్రణీత.. పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉన్నప్పటికీ, కెరీర్ పరంగా స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరలేకపోయింది ఈ కన్నడ భామ.
ఇక లాక్ డౌన్ టైంలోన కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును ప్రేమ వివాహం చేసుకుంది ప్రణీత. ఇటీవలే పండంటి పాపకు జన్మనిచ్చింది. కూతురు పుట్టాక ఎమోషనల్ అయిన ప్రణీత.. తన పాప ఫేస్ ని ఇన్ని రోజులు రివీల్ చేయలేదు. చాలా రోజుల సస్పెన్స్ తర్వాత తాజాగా తన కూతురి ముఖాన్ని ఫ్యాన్స్ కి చూపించింది. కూతురితో ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ప్రణీత కూతురి ఫోటోలు నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి. మరి హీరోయిన్ ప్రణీత కూతురు ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.