దక్షిణాది కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్.. ఇటీవలే తన భర్త పుట్టినరోజు సందర్బంగా తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని.. త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నామని స్కానింగ్ రిపోర్ట్ కూడా చూపించి సర్ప్రైజ్ చేసింది. 2021 లాక్ డౌన్ సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త నితిన్ రాజ్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రణీత తన పెళ్లిని ఇండస్ట్రీ పెద్దలు, ఫ్రెండ్స్ సమక్షంలో అంగరంగ వైభవంగా చేసుకోవాలని భావించింది. కానీ లాక్ డౌన్ కారణంగా అవేమి సాధ్యం కాలేదు.
గత నెలలో తన భర్త తనను ఎత్తుకున్న ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ప్రెగ్నన్సీ విషయాన్ని బయటపెట్టింది. అయితే.. తెలుగులో చాలా సినిమాలు చేసిన ప్రణీత.. హిట్స్ అందుకుంది కానీ స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరలేకపోయింది. ఇక లాక్ డౌన్ లో ఏ ఒక్కరికీ తెలియకుండా నితిన్ రాజ్ ని పెళ్లాడింది. అదీగాక ఇద్దరిదీ లవ్ మ్యారేజ్ కావడం విశేషం. దాదాపు పెళ్లి జరిగే వరకు ప్రణీత తన ప్రేమ విషయాన్ని రహస్యంగా దాచి ఉంచింది.అయితే.. ప్రణీత పెళ్లి విషయం కూడా ఫోటోలు బయటకు రావడం వల్ల తెలిసిందే. లేదంటే ప్రెగ్నన్సీ వరకు దాచి సడన్ షాక్ ఇచ్చేదేమో. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నానని చెప్పింది. తాజాగా ప్రణీత అభిమానులకు కొన్ని సర్ప్రైజింగ్ ఫోటోలు పోస్ట్ చేసింది. ఫోటోలు పోస్ట్ చేసి తనకు సీమంతం జరిగిన విషయాన్ని వెల్లడించింది. సాంప్రదాయ బద్దంగా ప్రణీత సీమంతం జరిగిందని ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం ప్రణీత సీమంతం ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ప్రణీత సీమంతం ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.