తెలుగు సినీ ప్రేక్షకులకు సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఎంతోకాలంగా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న ప్రగతి.. తల్లి, పిన్ని, అత్త, డాక్టర్, లాయర్ ఇలా అన్నిరకాల పాత్రలు చేసి ఆడియెన్స్ కి దగ్గరైంది. అయితే.. ఈ మధ్యకాలంలో సినిమాలలో తక్కువగా కనిపిస్తున్న ప్రగతి.. సోషల్ మీడియాలో మాత్రం దూసుకుపోతోంది. వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు జాలీగా తన లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ముఖ్యంగా జిమ్ కి వర్కౌట్స్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ వీడియోలతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది ప్రగతి.
ఇక తాజాగా ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతి.. తన కెరీర్, పర్సనల్ లైఫ్ తో పాటు ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది. తాను ఇంటర్ చదివేటప్పుడే సినిమాల్లోకి వచ్చానని చెప్పిన ప్రగతి.. హీరోయిన్ గా చాలా తక్కువ సినిమాలు చేశానని తెలిపింది. అలాగే తాను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు చాలా పొగరుగా ఉండేదాన్ని అని చెబుతూ ఓ సంఘటన షేర్ చేసుకుంది. ఒక సినిమాలో ప్రొడ్యూసర్, హీరో ఒక్కరే. ఓ వాన పాట ఉందని చెబితే ఓకే అన్నాను. తీరా షూటింగ్ టైంలో నచ్చని బట్టలు వేసుకోమని చెప్పేసరికి.. వాళ్లపై గట్టిగా అరిచి అక్కడినుండి వెళ్లిపోయాను. తర్వాత చిత్రయూనిట్ వచ్చి నన్ను కన్విన్స్ చేయాలని చూశారు.
నేను రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ సినిమాలో నటిస్తా గానీ, వీడిలాంటి చిన్న హీరోల పక్కన నటించను అని చెప్పేశాను. ఆ తర్వాత మూడు రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చేశాను. ఇదిలా ఉండగా.. అప్పటితరం హీరోయిన్స్ అంతా ఇప్పుడు మదర్ రోల్స్ చేస్తున్నారు కదా.. ఇక్కడ హీరోయిన్లకు మదర్ క్యారెక్టర్స్ గ్లామర్ విషయంలో కూడా పోటీ పడుతున్నారు కదా? అనే ప్రశ్నకు.. “హీరోయిన్లకు మదర్ గా అన్నప్పుడు అప్పు తెచ్చుకున్న అమ్మలాగా కనిపించకూడదు, కంప్లీమెంట్ అవ్వాలి. ఎలా ఉన్నా నేను అందగెత్తెనే. నాకు సినిమాలొస్తాయి. వర్కౌట్స్ తో నా అందం పెరగదు, నా స్ట్రెంత్, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది” అని చెప్పుకొచ్చింది ప్రగతి. ప్రస్తుతం ప్రగతి మాటలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.