ప్రగతి.. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన దైన నటనతో తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నారు నటి ప్రగతి. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌గా చేసిన ఆమె.. 2002నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోయారు. అత్త, అమ్మ, వదిన.. ఇలా అనేక రకాల పాత్రల్లో నటించి అందరిని మెప్పించారు. ఆమె ఇప్పటి వరకు వందకు పైగా సినిమాలో నటించారు. ఆమె ఒకవైపు సినిమాలో బిజీగా ఉంటూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్నారు. తన డ్యాన్స్ వీడియోలు, జిమ్ చేసే వీడియోలు షేర్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకి పాజిటీవ్ కామెంట్స్ తో పాటు నెగెటీవ్ కామెంట్స్ కూడా వస్తోన్నాయి. అయితే తనపై ట్రోల్స్ చేసేవారికి ప్రగతి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లాక్ డౌన్ సమయం నుంచి ప్రగతి సోషల్ మీడియాలో యాక్టీవ్ అయింది. ఆమెలోని అసలు విశ్వరూపం, ఇతర టాలెంట్స్ అన్ని బయట పెట్టింది. ఇంట్లో ఖాళీగా ఉండలేక సోషల్ మీడియాలో తనకు ఇష్టమైన డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఓ రేంజ్ లో అలరిస్తుంది. ఇప్పటికే ఆమె చేసిన డాన్స్ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ప్రగతి స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేసిన అందరిని ఆకట్టుకుంది. మొత్తానికి సోషల్ మీడియాను షేక్ తానూ ముందే ఉంటానని నిరూపిస్తోంది ఈ సీనియర్ నటి. అయితే ఆమెపై కొందరు విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. ప్రగతి ఆంటీ యంగ్ గా కనిపించేందుకు తెగ ప్రయత్నిస్తుందని, ఎంత ప్రయత్నించి పెరిగే వయస్సు తరగదు గా అంటూ కొందరు ఆమెపై తెగ కామెంట్స్ చేశారు.
అలాంటి వారికి తాజాగా నటి ప్రగతి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.”దేశోద్ధారకులారా.. నేను యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నించడం లేదు. నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తున్నా” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. ఓ వీడియోను సైతం పోస్ట్ చేసింది నటి ప్రగతి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తనపై కామెంట్స్ చేసే వారికి నటి ప్రగతి ఇచ్చిన కౌంటర్ పై మీ అభి ప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.