సినీ ఇండస్ట్రీలో కెరీర్ పరంగా కొంతకాలంపాటు అద్భుతమైన పాత్రలు చేసిన నటీనటులు.. ఆ తర్వాత సరైన గుర్తింపు తెచ్చే పాత్రలు దొరక్క బాధపడుతూ వెయిట్ చేస్తుంటారు. అప్పటివరకూ ఓపికగా సైడ్ క్యారెక్టర్స్ చేస్తుంటారు. కానీ పెద్దగా సంSuccess Suతృప్తి ఉండదని చెబుతుంటారు నటులు. తాజాగా నటి ప్రగతి చాలాకాలం తర్వాత F3 మూవీలో మంచి పాత్ర దొరికిందని ఎమోషనల్ అయ్యింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎఫ్3 మూవీ మంచి టాక్ తో ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే.
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నటి ప్రగతి కీలకపాత్ర పోషించింది. ఇక ఎఫ్3 సక్సెస్ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రగతి మాట్లాడుతూ.. “కెరీర్ బిగినింగ్ నుండి ఎన్నో మంచి పాత్రలు చేశాను. కానీ నాకు తగిన పాత్రలు పడలేదనే వెలితి ఇంకా నన్ను వెంటాడుతూ ఉంది. అందమైన, యంగ్ అమ్మగా, పెద్ద విలన్ పక్కన నిలబడే పాత్రలు చేసి సినిమాలలో సెట్ ప్రాపర్టీలాగా కనిపించాను. అలాంటి పాత్రలేవీ నాకు సంతృప్తి కలిగించలేదు.
ఇక నేను చేయాల్సింది ఇది కాదుని మధ్యలో కాస్త బ్రేక్ కూడా తీసుకున్నాను. మళ్లీ మంచి పాత్ర వస్తుందనే నమ్మకంతో ఎదురుచూస్తున్న టైంలో ‘ఎఫ్2’లో మూవీ అవకాశం వచ్చింది. అందులో నా పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఎఫ్3లో అవకాశం వచ్చింది. మంచి అవకాశం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను. నటిగా ఈ ఎఫ్3 మూవీ నాకెంతో సంతృప్తినిచ్చింది” అని ఎమోషనల్ అయ్యింది.
ఇదిలా ఉండగా.. ప్రగతికి ఎఫ్2 తో పాటు ఎఫ్3లో కీలక పాత్రలు దక్కించుకున్నారు. హీరోయిన్లకు తల్లిగా, గడసరి అత్తగా ఆమె పోషించిన పాత్రలకు ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాలుగా ఆర్టిస్ట్ గా ప్రగతి కంటిన్యూ అవుతోంది. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ప్రగతి.. ఆ తర్వాత గ్యాప్ తీసుకొని బాబీ మూవీలో తల్లి పాత్రతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇక ఎఫ్3 సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించగా, దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. మరి నటి ప్రగతి మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.