తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కామెడీ షోలలో ‘జబర్దస్త్’ ఒకటి. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ఈ షో నుండి జడ్జిలుగా మెగాబ్రదర్ నాగబాబు, రోజా వెళ్లిపోయాక ఇప్పటివరకూ ఆ స్థానాలలో పర్మినెంట్ జడ్జిలు ఎవరు సెట్ కాలేదు. ఇప్పటికే సింగర్ మనో, నాటి హీరోయిన్స్ మీనా, ఖుష్భూ, సంఘవి, శ్రద్ధాదాస్ లాంటివాళ్లు జడ్జిలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ.. వారెవ్వరూ ఈ మధ్య షోలో కనిపించడం లేదు. అలాగే వస్తున్న కొత్తవాళ్లు సైతం ఎక్కువ రోజులు కొనసాగడం లేదు.
ఈ క్రమంలో ప్రస్తుతానికి ఓ జడ్జిగా సీనియర్ హీరోయిన్ ఇంద్రజ కంటిన్యూ అవుతోంది. ఇక యాంకర్ గా అనసూయ వెళ్లిపోయాక రష్మీనే రెండు షోల(జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్)లను యాంకర్ గా నడిపిస్తోంది. తాజాగా జబర్దస్త్ కొత్త ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో అందరి స్కిట్స్ లో కామెడీ బాగానే ఆకట్టుకున్నాయి. కానీ.. సింగర్ మనో కాకుండా కొత్తగా వచ్చిన జడ్జిని చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ఆ వచ్చిన కొత్త జడ్జి ఎవరో కాదు నటి ప్రగతి.
ప్రగతి గురించి తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అక్కర్లేదు. సినీ నటిగా గుర్తింపు సంపాదించుకున్న ప్రగతి.. ఈ మధ్య సినిమాల విషయంలో సెలెక్టివ్ గా వెళ్తోంది. ఇప్పటివరకు అన్ని చేసిన క్యారెక్టర్స్ మళ్లీ మళ్లీ వస్తున్నాయని ఆ మధ్య ఎఫ్3 సినిమా ఈవెంట్ లో కూడా వాపోయింది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ప్రగతి ఎంత యాక్టీవ్ గా ఉంటుందో తెలిసిందే. తనశైలి డ్యాన్సులు, జిమ్ వర్కౌట్ వీడియోలు షేర్ చేస్తూ గ్లామర్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంటుంది. ఇక ఇప్పుడు జబర్దస్త్ లో జడ్జిగా కనిపించి సర్ప్రైజ్ చేసింది. మరి ప్రగతి అయినా ఎక్కువకాలం జడ్జిగా కొనసాగుతుందేమో చూడాలి. మరి జబర్దస్త్ కొత్త జడ్జిగా ప్రగతి ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.