ప్రగతి భాగ్యరాజ్ హీరోగా వచ్చిన తమిళ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తున్నారు.
సీనియర్ నటి ప్రగతి అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడనే చెప్పాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్రగతి.. కె.భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన `వీట్ల విశేషంగా` అనే తమిళ చిత్రంతో పదహారేళ్లకే హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు ఖాళీ లేకుండా ఏడు తమిళ సినిమాల్లో, ఒక మలాయళం సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఆమె తెలుగు తెరపై తల్లి, అక్కా పాత్రలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సీనీ కెరీర్ మెుదలు పెట్టినప్పడి నుండి తనకు ఎదురైనా అనుభవాలను నెటిజన్లతో పంచుకున్నారు.
అప్పట్లో ఓ సినిమా సెట్ లో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులకు గురయ్యానని తెలిపారు. అందులోనూ ఓ స్టార్ కమెడీయన్ చేసిన పనితో తనకు ఏం చేయాలో అర్థం కాలేదని, తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. ఆ స్టార్ కమెడీయన్ తనతో చాలా బాగా మాట్లాడేవారని.. తన విషయంలో చాలా పద్దతిగా ఉండేవారని అన్నారు. ఇంతలోనే అతనికి ఏమనిపించిందో తెలియదు కానీ..తనతో ఓ రోజు మిస్ బిహేవ్ చేశాడని తెలిపారు. అక్కడ జరిగిన సన్నివేశం తనను చాలా ఇబ్బంది పెట్టిందన్నారు. ఆ రోజు నుంచి తనకు ఎలాంటి వర్క్ చేయాలనిపించలేదని, ఆ రోజు లంచ్ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి టీ కూడా తాగాలనిపించలేదని చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత జరిగిన సంఘటన గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ అతడు అక్కడి నుంచి షూటింగ్ అయిపోయి వెళ్లిపోతుంటే.. నేను క్యారవాన్ లోకి తీసుకెళ్లి ప్రశ్నించాను. మీతో ఎప్పుడైనా నేను మిస్ బిహేవ్ చేశానా? అని అడిగాను. ఆ రోజు నేను కూడా మీ లాగా రియాక్ట్ అయితే మీ పరిస్థితి ఏంటి అని నిలదీశాను. అక్కడ మీరు కాబట్టే నేను ఒక నిమిషం ఆలోచించి సైలెంట్ గా ఉండిపోయానని అన్నాన’’ అని తెలిపారు. మరి, ప్రముఖ కమెడియన్ ప్రగతితో మిస్ బిహేవ్ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.