వెండితెరపై ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ పెద్దగా కలిసిరాలేదు. దీంతో ప్లాన్ మార్చేసింది. సహాయ పాత్రలు వచ్చినా సరే చేస్తూ పోయింది. లైఫ్ ని జాలీగా ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఇక కొన్నాళ్ల క్రితం బుల్లితెరపై ఢీ డ్యాన్స్ జడ్జిగా వచ్చింది. అప్పటి నుంచి పూర్ణ లైఫ్ మారిపోయింది. సినిమాల ద్వారా కొందరికి మాత్రమే తెలిసిన ఆమె.. ఈ షో దెబ్బకు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. చాలా ఫేమ్ సంపాదించుకుంది. ప్రతిఇంట్లోనూ ఓ మనిషి అయిపోయింది. ఇదంతా పక్కనబెడితే సడన్ గా పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది. ప్రస్తుతం వర్క్ లైఫ్ తోపాటు ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇలాంటి సమయంలో పూర్ణకు సంబంధించిన ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన పూర్ణ, ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సీమటపాకాయ్, అవును, లడ్డుబాబు, అవును 2, రాజుగారి గది లాంటి చిత్రాలు చేసింది. ప్రస్తుతం నాని ‘దసరా’లో నటిస్తోంది. తెలుగులో పెద్ద హీరోలతో సినిమాలు చేయలేకపోయింది గానీ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది. ఇక సినిమాల తగ్గుతున్నాయనే టైంకి ఢీ షోకి జడ్జిగా మారి మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చింది. ఇలా కెరీర్ పరంగా జాలీగా ఉన్న పూర్ణ.. ఈ మధ్య దుబాయి బిజినెస్ మేన్ షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది. దీని తర్వాత షానిద్, పూర్ణకు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చాడట. అది కూడా ఫస్ట్ నైట్ రోజట.
తమ జీవితంలో గుర్తుండిపోయే ఆ రోజు.. ఇలాంటి గిఫ్ట్ తన భర్త ప్లాన్ చేయడంతో పూర్ణ ఫుల్ ఫిదా అయిపోయిందట. ఇక పలు వెబ్ సైట్స్ రాసిన సమాచారం ప్రకారం.. పూర్ణకు షానిద్ ఓ డైమండ్ రింగ్ ని బహుమతిగా ఇచ్చారట. అంతేకాదు ఆ రింగ్ నార్మల్ గా చూస్తే పూర్ణ పేరు కనిపిస్తుంది. రివర్స్ లో చూస్తే షానిద్ పేరు కనిపించేలా డిజైన్ చేశారట. ఇలాంటి దాన్ని బహుమతిగా ఇచ్చేసరికి పూర్ణ ఉబ్బితబ్బిబయిందట. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు పెళ్లి తర్వాత బోలెడంత బంగారం కూడా పూర్ణకి షానిద్ ఇచ్చాడట. మరి పైన చెప్పిన వార్తల్లో నిజమెంత ఏంటనేది తెలియాల్సి ఉంది.