నటి పూర్ణ అటు హీరోయిన్ గా నటిస్తూనే ఇటు బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. 2004లో యాక్టింగ్ ప్రారంభించిన ఈ మలయాళం భామ.. 2007లో శ్రీమహాలక్ష్మీ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సీమటపాకాయ్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. రవిబాబు తెరకెక్కించిన అవును సినిమాతో హార్రర్ హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం పలు కామెడీ షోలు, డాన్సింగ్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే ఇన్నాళ్లు తన పర్సనల్ లైఫ్ గురించి ఎలాంటి విషయాన్ని బయటపెట్టని పూర్ణ.. ఇప్పుడు డైరెక్ట్ గా కాబోయే వాడిని పరిచయం చేసింది.
‘నా కుటుంబం ఆశీర్వాదంతో నా జీవితంలోని తర్వాతి అంకంలోకి అడుగు పెట్టబోతున్నా.. ఇట్స్ అఫీషియల్’ అంటూ చేసుకోబోయే వ్యక్తి ఫొటోని షేర్ చేసింది. అసిఫ్ అలీ అనే ఓ బిజినెస్ మ్యాన్ ను నటి పూర్ణ వివాహం చేసుకోబోతోంది. అసిఫ్ అలీ కోట్ల రూపాయలకు అధిపతి అయిన జేబీఎస్ గ్రూప్ కంపెనీస్ ఫౌండర్, సీఈవో. ఈ ఫొటోలు ఎంగేజ్మెంట్ రోజువని తెలుస్తోంది. అయితే వీరిది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
With the blessings of family stepping to my next part of life❤️💍 and now it’s official ❤️ pic.twitter.com/v7Qo04t3Ws
— Purnaa (@shamna_kkasim) June 1, 2022
ఇంక సినిమాల విషయానికి వస్తే.. పూర్ణ తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో కలిపి మొత్తం ఈ ఏడాది 7 సినిమాల్లో నటిస్తోంది. పాదం పేసుం, పిశాసు 2, అమ్మాయి, నెంజుకు నీతి సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. టాలీవుడ్ లో తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ, బ్యాక్ డోర్ సినిమాలు కూడా షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మలయాళంలో వ్రిధం అనే సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మరి, కామెంట్స్ రూపంలో హీరోయిన్ పూర్ణకు మీరూ శుభాకాంక్షలు చెప్పేయండి.