నటి పూర్ణ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది పూర్ణ. దుబాయ్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి తెగ వైరలయ్యాయి. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగినట్ల తెలుస్తోంది. అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకలో పట్టు దుస్తుల్లో మెరిసిపోయింది పూర్ణ. ముస్లిం సంప్రదాయ పద్దతుల్లో జరిగిన ఈ వివాహ వేడుకలో బంగారు రంగు పట్టు చీరలో.. ఒంటి నిండా నగలతో.. పుత్తడిబొమ్మలా మెరిసిపోయింది పూర్ణ. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుకోని పరిస్థితుల్లో.. దుబాయ్‌లో హడావుడిగా తన వివాహం జరిగింది అని చెప్పిన పూర్ణ.. దీపావళి రోజున పెళ్లి ఫోటోలు షేర్ చేసి అందరిని సర్ప్రైజ్ చేసింది.
ఇక పెళ్లి కుమార్తె గెటప్‌లో చూడచక్కగా.. ఎంతో అందంగా ఉంది పూర్ణ. ఈ ఫోటోల్లో పూర్ణ వేసుకున్న బంగారు అభరణాలు అందరిని ఆకర్షించాయి. పైగా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు పెళ్లి సందర్భంగా.. భార్యాభర్తలు ఒకరికొకరు ఖరీదైన బహుమతులు ఇచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూర్ణకు ఆమె భర్త ఏం గిఫ్ట్ ఇచ్చాడు అనే దాని గురించి ఆరా తీయసాగారు నెటిజనులు. ఇక వివాహం సందర్భంగా పూర్ణకు ఆమె భర్త ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
వివాహం సందర్భంగా పూర్ణ భర్త ఆమెకు.. 1700 గ్రాముల బంగారం అంటే 170 తులాల గోల్డ్‌తో పాటు ఖరీదైన విల్లాను ఆమె పేర రిజిస్టర్ చేయించాడు అంటూ వార్తలు వస్తున్నాయి. పూర్ణ భర్త దుబాయ్‌లో పెద్ద వ్యాపారవేత్త కావడంతో.. ఇవన్ని ఆయన దృష్టిలో చాలా తక్కువే అయి ఉండవచ్చు.. కానీ ఇండియన్ కరెన్సీలో కోట్ల ఖరీదు చేస్తాయి అంటున్నారు వారి సన్నిహితులు. ఇక ఈ ఏడాది మేలో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీతో పూర్ణకు ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక జూన్ 12న దుబాయ్‌లో అత్యంత సన్నిహితులు సమక్షంలో తమ వివాహం జరిగిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది పూర్ణ.
సీమ టపాకాయ్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది పూర్ణ. ఆ తర్వాత రవిబాబు డైరెక్షన్‌లో చేసిన అవును, అవును 2 చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ప్రస్తుతం బుల్లితెర మీద పలు షోలకు జడ్జిగా చేస్తుంది. ఇక సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ.. బిజీగా ఉంది పూర్ణ. వివాహం చేసుకుందని తెలియడంతో అభిమానులు పూర్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు.