సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యహారం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. గతంలో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులు ఇదే అంశంపై కొండను తవ్వి ఎలకను కూడా పట్టనట్లు వ్యవహరించారు. అప్పట్లో ఈ కేసుపై విచారణ వేగవంతం చేస్తున్నట్లు మీడియా కథనాల్లో మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తీరా చూస్తే డ్రగ్స్ వ్యవహారంలో ఈడీ అధికారులు ఎలాంటి బలమైన ఆధారాలు రాబట్టలేకపోయారు.
ఇక ఇటీవల కాలంలో మళ్లీ ఇదే డ్రగ్స్ వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చింది ఈడీ. దీంతో డ్రగ్స్ కేసులో అనుమానితులుగా ఉన్న వాళ్లందరినీ ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్, నటీ చార్మి, రకూల్ ప్రీత్ సింగ్ వంటి వాళ్లను ఈడీ అధికారులు విచారించారు. అయితే ఈ నేపథ్యంలోనే నటీ పూనమ్ కౌర్ డ్రగ్స్ వ్యవహారంపై ట్విట్టర్ లో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
‘డ్రగ్స్ వ్యవహారం అనేది కేవలం సెలబ్రిటీల సమస్య కానే కాదని, ఇది ప్రతీ ఒక్కరి సమస్య అంటూ ట్విట్ చేసింది. ఇది సరిహద్దు, రాజకీయ ప్రేరణతో జరుగుతోన్న వ్యవహారమని తెలిపింది. దీంతో పాటు ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్యే అని.. డ్రగ్స్ అంశంపై తొందరలోనే నా అనుభవాలను మీతో పంచుకుంటానని ఆమె ట్విట్ చేసింది. తాజాగా పూనమ్ కౌర్ చేసిన ట్విట్ తో సినీ పరిశ్రమలో కాకరేగుతోంది. అసలు పూనమ్ కౌర్ ఈ విధమైన కామెంట్ల చేయటం వల్ల తెర వెనుక ఏం జరిగిందన్న చర్చ సినీ వర్గాల్లో జోరుగా ఊపందుకుంది.
DRUGS IS NOT A CELEBRITY ISSUE !
IT IS EVERY ONES ISSUE !
ITS A BORDER ISSUE !
ITS A POLITICAL AGENDA DRIVEN ISSUE !
ITS A STRONG PARALLEL ECONOMY ISSUE !
I WILL SPEAK ON THIS ISSUE ,WITH MY OWN EXPERIENCE SOON !
Jai hind
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 3, 2021