పూనమ్ భజ్వా.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు. హీరోయిన్ గా, సపోర్టింగ్ నటిగా తెలుగులో చాలా మంచి సినిమాలు చేసింది. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో బిజీ యాక్ట్రస్ గా వెలుగు వెలిగింది. కానీ, ప్రస్తుతం చేతిలో ప్రాజెక్టులు లేక ఖాళీగా ఉంటున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు, తన జీవితంలోని ముఖ్యమైన సమాచారాన్ని ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది.
గత కొద్దిరోజులుగా పూనమ్ భజ్వా గ్లామర్ డోస్ పెంచిన విషయం తెలిసిందే. నటిగా బిజీగా ఉన్న సమయంలో కంటే ఇప్పుడే అభిమానులను తన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పైగా ట్రోల్ చేసేవారికి గట్టి కౌంటర్ కూడా ఇస్తోంది. ఆమె అలా అందాలను ఆరబోస్తుంటే నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్లు కూడా లేకపోలేదు. అలాంటి వారిని తాను పట్టించుకోనని చెప్పుకొచ్చింది. తన అభిమానులు తనను ఎలా అయితే చూడాలని కోరుకుంటారో.. తాను అలాంటి ఫొటోలనే ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తానంటూ కుండ బద్దలు కొట్టేసింది. అభిమానులకు నచ్చినట్లుుగా ఉండటం తప్పేమీ కాదన్నట్లు తనని తాను సమర్థించుకుంది.
తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. వెనుక ఉన్న సూర్యుడు కూడా చిన్నబోయేలా తన పరువాలను ఒలకబోస్తున్న పూనమ్ భజ్వాను చూసి ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ఈ చిత్రాలను చూసి అభిమానులు పూనమ్ భజ్వా అందాలను వర్ణిస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. ఇంక సినిమాల విషయానికి వస్తే తెలుగులో 2019లో కథనాయకుడు సినిమాలో నటించింది. ఈ ఏడాది మలయాళంలో ఓ చిత్రం, తమిళ్ లో ఓ చిత్రం చేసి అలరించింది. వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవడంలో పూనమ్ భజ్వా ముందుంటుంది అంటూ సినిమా వర్గాల్లో టాక్ కూడా ఉంది. ఆమె నుంచి తర్వాత ఎలాంటి చిత్రాలు రాబోతున్నాయి అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.