పాయల్ రాజ్ పుత్.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో మందిని అభిమానులను సొంతం చేసుకుంది. Rx100 సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు తెలుగులో సరైన గుర్తింపు లభించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Rx100, వెంకీ మామ సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచినా కూడా.. ఆమె కెరీర్ కు పెద్దగా దోహదపడలదేనే చెప్పాలి. అయినా ఈ భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఎలాంటి ఢోకా లేదు. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్- మంచు విష్ణు- సన్నీ లియోన్ చేస్తున్న మూవీకి ‘జిన్నా’ అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.
సినిమాల సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం ఈ భామ చేసిన రీల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ ర్యాప్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య చేయబడిన విషయం తెలిసిందే. సిద్ధూ మూసేవాలా అభిమాని అయిన పాయల్ ప్రియుడు సౌరభ్ దింగ్రా.. స్వయంగా కొన్ని ర్యాప్ లిరిక్స్ రాశాడు. రాయడమే కాకుండా.. ఆ లిరిక్స్ ని ఓ పాటలా పాడాడు కూడా.
సౌరభ్ దింగ్రా చేసిన ఆ ర్యాప్ సాంగ్ క్ మంచి స్పందన లభించింది. ఆ ర్యాప్ లిరిక్స్ కు లిప్ మూమెంట్ ఇస్తూ.. పాయల్ రాజ్ పుత్ ఓ వీడియో చేసింది. అయితే వీడియో చేయడం వరకూ బాగానే ఉంది గానీ, చివర్లో పాయల్ మిడిల్ ఫింగర్ చూపించడం చర్చనీయాంశంగా మారింది. పాట బాగానే పాడావు.. మరి ఆ ఫింగర్ చూపడం దేనికి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. చాలా వరకు అభిమానులు మాత్రం అద్భుతంగా చేశారంటూ కామెంట్ చేస్తున్నారు. పాయల్ రీల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.