గత కొంతకాలంగా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. దాంతో ఓ హీరోయిన్ మనసు పెళ్లి మీదికి మళ్లినట్లుంది. నన్ను పెళ్లి చేసుకుంటారా? అంటూ కుర్రాళ్లకు స్టార్ హీరోయిన్ క్రేజీ ఆఫర్ ఇచ్చింది.
గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీలు అంతా పెళ్లిళ్లపై పడ్డారు. కత్రీనా కైఫ్, కియారా అద్వానీ, ఆలియా భట్, అతియా శెట్టిలతో పాటుగా మరికొంత మంది పెళ్లి పీటలెక్కారు. ఇక వీరందరి పెళ్లిళ్లు చూసిన ఓ స్టార్ హీరోయిన్ తనకు కూడా వివాహం చేసుకోవాలని ఉందంటూ.. తన మనసులోని మాటను బయటపెట్టింది. ప్రస్తుతం నేను ఏ రిలేషన్ లో లేను మింగిల్ కావడానికి ఎవరైనా ఉన్నారా? నన్ను పెళ్లి చేసుకుంటారా? అంటూ కుర్రాళ్లకు క్రేజీ ఆఫర్ ఇచ్చింది. మరి ఇంతకి ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం పదండి.
పరిణితీ చోప్రా.. ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ పంజాబీ బ్యూటీ.. తన అందంతో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇప్పటికే పలు హిట్ చిత్రాలతో మంచి జోరుమీదున్న ఈ భామ.. వరుసగా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన పరిణితీ చోప్రా రిలేషన్ ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చింది.”ప్రస్తుతం బాలీవుడ్ లో జరుగుతున్న పెళ్లిళ్ళు చూస్తుంటే నాకూ పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉన్నాను. త్వరలో మింగిల్ అవ్వాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆలియా, కియారా, అతియా శెట్టీల పెళ్లి ఫోటోలు చూస్తుంటే నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది” అని పరిణితీ చోప్రా చెప్పుకొచ్చింది.
గతంలో ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నానని, కానీ ఇప్పుడు పెళ్లికి సిద్దంగా ఉన్నాను అని పరిణితీ పేర్కొంది. అనంతరం ఫ్యాన్స్ ను ఉద్దేశించి ‘నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారు? మంచి అబ్బాయి ఉంటే చూడండి’ అంటూ నవ్వుతూ.. కుర్రాళ్లకు వలపు వల విసిరింది. ఇక గత కొన్ని నెలల్లోనే స్టార్ హీరోయిన్ ల పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. నటి స్వరభాస్కర్ సైతం సీక్రెట్ గా పెళ్లి చేసుకుని, తాజాగా తన పెళ్లి వార్తను ప్రకటించింది. వీరందరిని చూసిన పరిణితీ చోప్రా మనసు పెళ్లి వైపు మళ్లినట్లుంది అంటున్నారు నెటిజన్లు. అంతేగా మరి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి మరి అని మరికొందరు నెటిజన్లు రాసుకొస్తున్నారు. మరి పరిణితీ చోప్రా కామెంట్స్ పై ఎంత మంది స్పందిస్తారో చూడాలి.