ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లతో ఫామ్ లో ఉన్న హీరోయిన్స్.. ఇండస్ట్రీకి దగ్గరలో షూటింగ్స్ కి అనువుగా ఉండేలా ఫ్లాట్స్ కొనుక్కోవడం గురించి వింటూనే ఉంటాం. ఒక్కోసారి తాము కొత్తగా ఫ్లాట్, ఇల్లు కొనుగోలు చేసిన విషయాన్ని స్వయంగా వారే ప్రకటిస్తుంటారు. తాజాగా టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తున్న ఓ బ్యూటీ.. హైదరాబాద్ లో కాకుండా ముంబైలో ఇల్లు కొన్నానని చెప్పి సర్ప్రైజ్ చేసింది.
సాధారణంగా ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లతో ఫామ్ లో ఉన్న హీరోయిన్స్.. ఇండస్ట్రీకి దగ్గరలో షూటింగ్స్ కి అనువుగా ఉండేలా ఫ్లాట్స్ కొనుక్కోవడం గురించి వింటూనే ఉంటాం. ఒక్కోసారి తాము కొత్తగా ఫ్లాట్, ఇల్లు కొనుగోలు చేసిన విషయాన్ని స్వయంగా వారే ప్రకటిస్తుంటారు. తాజాగా టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తున్న ఓ బ్యూటీ.. హైదరాబాద్ లో కాకుండా ముంబైలో ఇల్లు కొన్నానని చెప్పి సర్ప్రైజ్ చేసింది. పైగా ఇప్పటిదాకా ఆ బ్యూటీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గానీ, స్టార్ హీరోల సరసన సినిమాలు గానీ చేయలేదు. కేవలం తనకు వస్తున్న అవకాశాలతో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసుకుంటూ వెళ్తోంది.
అలా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్న అమ్మడు.. ఏకంగా ముంబైకి మకాం మార్చబోతుందట. బిగ్గెస్ట్ హిట్స్ కొట్టకపోయినా.. ఆర్థికంగా బాగానే వెనకేసుకుందని తెలుస్తోంది. తాను ముంబైకి షిఫ్ట్ అవుతున్నట్లు స్వయంగా ఆమే చెప్పడం గమనార్హం. అదేంటీ.. చేస్తోంది తెలుగు సినిమాలు.. ముంబైకి వెళ్లి ఏం చేయనుంది? అని అందరికీ డౌట్ కూడా క్రియేట్ అయ్యింది. అందుకు అమ్మడు ఏం చెప్పిందంటే..? ఈ విషయం చెప్పే ముందు.. మీకు అసలు ఆమె ఎవరో తెలియాలి. సో.. టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ ముంబైకి వెళ్ళాలి అనుకుంటున్న హీరోయిన్ ఎవరో కాదు.. నివేత పేతురాజ్.
ఇంతకీ ముంబైకి మకాం ఎందుకు మార్చబోతుందంటే.. నివేత ప్రెజెంట్ హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. ఇటీవల ‘దాస్ కా ధమ్కీ’ మూవీలో విశ్వక్ సేన్ సరసన నటించిన ఈ భామ.. హిందీ వెబ్ సిరీస్ చేస్తూనే ముంబైలో ఇల్లు కొనేసిందట. త్వరలోనే అక్కడికి మకాం మార్చనున్నట్లు ఆమె తెలిపింది. ఇప్పటివరకు పెద్ద సినిమాలైతే చేయలేదు. కానీ.. అటు గ్లామర్ పరంగా, నటన పరంగా సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాగా.. తక్కువ టైంలో తెలుగుతో పాటు తమిళ సినిమాలలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. అయితే.. తెలుగు సినిమాలు చేస్తూ.. ముంబైలో ఇల్లు కొనడంపై స్పందిస్తూ.. హైదరాబాద్ లో ఇల్లు కొనడానికి చాలా ట్రై చేశాను. కానీ.. కుదరలేదు. మిగతా వివరాలు త్వరలో చెప్తానని అంది. ప్రస్తుతం నివేత ముంబైలో ఇల్లు కొన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి నివేత పేతురాజ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.