తెలుగు బుల్లితెరపై అనేక షోలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలాంటి వాటిల్లో “క్యాష్” ప్రోగ్రామ్ ఒకటి. సుమ కనకాల యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షో.. బుల్లితెర ప్రేక్షకులను ఓ రేంజ్ లో కట్టిపడేస్తుంది. సుమ తనదైన పంచ్ లతో అభిమానులను ఆకట్టుకుంది. ఇక ప్రతి వారం సినిమాకు సంబంధించిన ప్రముఖలు ఈ షోకు అతిధులుగా వచ్చి సందడి చేస్తుంటారు. తమకు సంబంధించిన విషయాలను ఈ షేర్ చేసుకుంటారు. తాజాగా మెగా డాటర్ నిహారిక తో పాటు నిత్యశెట్టి, నిఖిల్, అనిల్ జీలా క్యాష్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా, శివ సాయి వర్దన్ దర్శకత్వం వస్తున్న వెబ్ సిరీస్ “హలో వరల్డ్”. ఇందులో నిత్యశెట్టి నిఖిల్, అనిల్ జీలా నటిస్తున్నారు. షోలో నిహారిక, నిఖిల్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటుంది. నీవు పసికందువు కాదురా.. కసికందువురా.. అంటూ సెటైర్లు కూడా వేసింది. తాజాగా విడుదలైన ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.
నిహారిక గురించి మనందరికీ తెలిసిందే. తన మాటలతో చేష్టలతో అల్లరి అల్లరిగా ఉంటూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. కాగా ఈమె యాంకర్ గా మాత్రమే కాకుండా హీరోయిన్ గా కూడా పలు సినిమాలో నటించి.. మంచి మార్కులే పొందింది. అయితే పెళ్లి తర్వాత నిహారిక ప్రొడ్యూసర్ గా మారి వెబ్ సిరీస్ నిర్మాణంలో బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే జీ 5 ఓటిటి సంస్థతో కలిసి నిహారిక “హలో వరల్డ్” అనే వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది.అయితే ఈ వెబ్ సిరీస్ త్వరలోనే జి ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ వెబ్ సిరీస్ నటులు అందరు క్యాష్ షోలో పాల్గొన్నారు.యాంకర్ సుమ తో పాటు తాను కూడా కౌంటర్లు వేస్తూ అలరించింది నిహారిక.తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు.ఒక స్కిట్ చేస్తూ.. నిఖిల్ నేను ఏమి ఎరుగని పసికందును అమ్మ అని సుమతో అంటాడు. వెంటనే నిహారిక.. రేయ్ నువ్వు పసికందువు కాదురా.. కసికందు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: Getup Srinu: ఏడుకొండలు ఆరోపణలపై నోరు విప్పిన గెటప్ శీను.. బిల్డప్ బాబయ్ అంటూ కౌంటర్!
ఇదీ చదవండి: Nithya Menon: మలయాళ నటుడితో పెళ్లికి ఓకే చెప్పిన నిత్య మేనన్?
ఇదీ చదవండి: Marriage: సీక్రెట్‌గా నాలుగో పెళ్లి చేసుకున్న టాప్ హీరోయిన్..!