సినీ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు నెటింట్లో వైరల్ అవుతుంటాయి. హీరో హీరోయిన్లు కొన్ని ఫోటోలు చూస్తే అసలు గుర్తుపట్టలేనంతగా ఉంటారు. ఇక తమ అభిమాన హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు చూసి.. వారి ఫ్యాన్స్ ఎంతో మురిసిపోతుంటారు. అలాగే సెలబ్రిటీల చిన్నప్పుటి ఫోటోనూ, ఇప్పుడు ఫోటో పక్కన పెడితే అసలు వారిని ఏమాత్రం గుర్తుపట్టలేము. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓ సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్ననాటి ఫోటోలో చాలా ముద్దుగా బొద్దుగా కనిపిస్తున్న ఆ పాప ఇప్పుడు ఓ హీరోయిన్.. అంతే కాక మరో స్టార్ హీరోకి భార్య కూడా. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
తమిళ డబ్బింగ్ మూవీ ‘రాజా రాణి’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి నజ్రియా నజీమ్. మొదటి మూవీలోనే తనదైన అందం, అభినయంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది ఈ నజ్రియా. మలయాళంలో క్రేజీ హిట్లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. ప్రముఖ హీరో ఫాహద్ ఫాజిల్ ను పెళ్లి చేసుకుంది. ఈ స్టార్ కంపుల్ ఇద్దరు ఇటీవల తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు. ఫాహద్ ‘పుష్ప’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఓ రేంజ్ లో అందరిని ఆకట్టుకున్నాడు. అలాగే ‘అంటే సుందరానికి’ సినిమాతో నజ్రియా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో వీరిద్దరికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అయితే ఈ స్టార్ కంపుల్స్ కి తెలుగులో ఉన్న క్రేజ్ నేపథ్యంలో వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటిస్తే చూడాలని ప్రేక్షకులు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. గతంలో వీరిద్దరు కలిసి తమ కాంబోలో ఓ సినిమా వస్తుందని టాక్ రావడంతో అభిమానుల్లో ఆశలు కలిగాయి. ఇక ఫాహద్ పుష్పలో షెకవత్ అనే పోలీసు అధికారి పాత్రలో హీరోకి ధీటుగా కనిపించాడు. ఫాహద్ పుష్ప-2 సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇక మలయాళ బ్యూటీ నజ్రియా కూడా పలు సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడి చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.