నజ్రియా నజీమ్‌కు తెలుగు నాట ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె తెలుగులో చేసింది ఒక సినిమానే అయినా.. ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. రాజారాణి సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.
నజ్రియా నజీమ్.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘రాజారాణి’ సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నజ్రియా. అది తమిళ్ డబ్బింగ్ సినిమా అయినా తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నజ్రియా నటనకు కుర్రకారు ఫిదా అయిపోయారు. నజ్రియా ఇప్పటి వరకు తెలుగులో కేవలం ఒక సినిమా మాత్రమే చేశారు. ఆమె నానితో కలిసి ‘ అంటే సుందరానికి’ సినిమాలో నటించారు. ఈ సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె ఇంత వరకు ఏ సినిమాలో కూడా కనిపించలేదు.
అయినప్పటికి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటూ వచ్చారు. తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ వచ్చారు. అలాంటి ఆమె ఓ సడెన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాకు నుంచి బయటకు రావాలని నిశ్చయించుకున్నారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘నేను నా అన్ని సోషల్ మీడియా ఖాతాలనుంచి బ్రేక్ తీసుకుందామని అనుకుంటున్నాను. నేను మీ ప్రేమ, సందేశాలను చాలా మిస్ అవుతాను. నేను మళ్లీ తిరిగి వస్తాను. నేను ప్రమాణం చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
అయితే, ఇందుకు గల కారణాలు ఆమె వెల్లడించలేదు. కాగా, నజ్రియా నజీమ్ 2006లో వచ్చిన ‘పలుంకు’ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బాలనటిగా ఇది ఆమె మొదటి సినిమా. 2013లో వచ్చిన ‘మ్యాడ్ డాడ్’ సినిమాతో హీరోయిన్‌గా మారారు. అదే సంవత్సరం వచ్చిన ‘రాజా రాణి’ సినిమాతో ఆమె క్రేజ్ పెరిగిపోయింది. మరి, నజ్రియా నజీమ్ తన సోషల్ మీడియా ఖాతాలకు బ్రేక్ ఇవ్వాలనుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.