నవ్య స్వామి అంటే పరిచయం అక్కర్లేని పేరు. నవ్య స్వామిగా కంటే కూడా మీనాక్షిగా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. ‘నా పేరు మీనాక్షి’ సీరియల్ తో తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ కన్నడ క్యూటీ తన అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. 2011 లో తంగలి అనే కన్నడ సీరియల్ ద్వారా మొదటి అవకాశం చేజిక్కించుకున్న నవ్య స్వామి ఆ తర్వాత తమిళ్, తెలుగు భాషల్లో పలు సీరియల్స్ లో నటించి రాణించింది.
స్టార్ సవిరుచి అనే కుకరీ షోతో పాటు ఝలక్ దిక్లా జాకి కన్నడ వెర్షన్ అయిన తక దిమి త డ్యాన్సింగ్ స్టార్ అనే షోలో కంటిస్టెంట్ గా చేసింది. కన్నడలో ఫేమస్ టీవీ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న నవ్య స్వామి, ఆ తర్వాత తమిళ, తెలుగు భాషల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సెట్ చేసుకున్నారు. నా పేరు మీనాక్షి, ఆమె కథ సీరియల్స్ శుభం కార్డు పడడంతో పలు ఈవెంట్లు, షోలు చేస్తూ సందడి చేస్తోంది.
‘ఆమె కథ’ సీరియల్ ఫేమ్ రవి కృష్ణతో బాగా సన్నిహితంగా ఉంటుందని, వీరిద్దరి మధ్య డ్యాష్ డ్యాష్ నడుస్తోందని నెటిజన్లు రూమర్స్ స్ప్రెడ్ చేశారు. అయితే అవన్నీ అబద్దాలు అంటూ కొట్టి పడేసారు. తమ మధ్య ఎన్ని రూమర్స్ వచ్చిన వాళ్ళు మాత్రం సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. సోషల్ మీడియాలో ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. నవ్య పెట్టిన ప్రతీ పోస్ట్ కు బుల్లితెర నటుడు రవి కృష్ణ రియాక్ట్ అవుతూ ఉంటారు.
ఇదిలా ఉంటే వ్యక్తిగత విషయాలు, వర్కౌట్ వీడియోలతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా, సరదాగా ఉండే ఈ బ్యూటీ ఉన్నట్టుండి సీరియస్ స్టోరీ షేర్ చేసింది. “నువ్వు ఇతరుల విషయంలో చెత్త పనులు చేసి గొప్పగా బతకాలి అని అనుకోకు” అంటూ ఒక స్టోరీ పోస్ట్ చేసింది. ఎప్పుడూ లేనిది ఇలా సీరియస్ పోస్ట్ పెట్టడంతో అభిమానులు షాక్ కి గురయ్యారు. ఎవరి కోసం ఇలా పెట్టింది? ఎవరు ఆమెను అంతగా బాధపెట్టింది అంటూ నెటిజన్లు ఆలోచించడం మొదలుపెట్టేశారు. మరీ ఇంత సీరియస్ అయ్యేంత కోపం తెప్పించిన సంఘటన ఏంటో? ఆ మనిషి ఎవరో? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: వీడియో: లెైవ్ లో కుర్రాడి చెంప పగలగొట్టిన రిపోర్టర్!