ఈమె హీరోయిన్ స్టార్ హోదా అందుకుంది. ఆ తర్వాత ఫిజిక్ మెంటైన్ చేయలేక ఫేడౌట్ అయిపోయింది. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా మారిపోయింది. ఎవరో కనిపెట్టారా?
ఈ పాప స్టార్ హీరోయిన్. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. 17 ఏళ్లకే మిస్ సూరత్ అయిపోయింది. తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో కాస్త పద్ధతిగా ఉండేది కానీ రానురాను గ్లామర్ డోస్ పెంచేసింది. బబ్లీగా తయారై టెంప్ట్ చేసింది. దాదాపు పదేళ్లపాటు అలా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేసింది. ఆ తర్వాత పలు కారణాలతో ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో పెళ్లి చేసుకుంది. కవలలు పుట్టారు. ప్రస్తుతం రాజకీయాల్లో కాస్త బిజీగా ఉంది. మే 10న ఆమె పుట్టినరోజు. మరి ఇంతలా చెప్పాం కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
అసలు విషయానికొచ్చేస్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి గుజరాత్ లోని సూరత్ లో పుట్టింది. 1998లో మిస్ సూరత్ అయిపోయింది. 2001లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నప్పటికీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. క్రేజ్ మాత్రం విపరీతంగా సంపాదించింది. దీంతో యాడ్స్ లో నటించింది. ఆ తర్వాత 2002లో ‘సొంతం’లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. పైన ఫొటోలో ఉన్నది నమిత. ఈమెని చాలామంది తమిళ అమ్మాయి అనుకుంటారు కానీ కాదు. 2002 నుంచి 2021 వరకు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. పలు రియాలిటీ షోల్లోనూ పార్టిసిపేట్ చేసింది.
సినిమాల్లో దాదాపు అవకాశాలు తగ్గిపోయిన టైంలో తమిళ బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో నమిత పాల్గొంది. 28 రోజుల పాటు ఉంది. ఈ హౌస్ లోనే పరిచయమైన వీరేంద్ర చౌదరిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. వీళ్లకు కవలపిల్లలు పుట్టారు. ప్రస్తుతం తమిళనాడు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా బీజేపీ తరఫున నమిత బాధ్యతలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ తో బిజీ అయిపోయింది కానీ ఇప్పటికీ ‘బిల్లా’ చూస్తే అందరికీ ఈమె ఒంపుసొంపులే గుర్తొస్తాయి. సో అదన్నమాట విషయం. ఈ బ్యూటీ చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.