సినీ పరిశ్రమకు చెందిన వారి జీవితాలు పైకి కనిపించేంత అందంగా ఏమీ ఉండవు. స్టార్‌డమ్ పక్కన పెడితే వాళ్లూ అందరిలాంటి మనుషులే. వాళ్లకీ కష్టాలుంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌లో చాలా ఒడిదుడుకులు, మనస్ఫర్థలు ఉంటాయి.
సినీ పరిశ్రమకు చెందిన వారి జీవితాలు పైకి కనిపించేంత అందంగా ఏమీ ఉండవు. స్టార్‌డమ్ పక్కన పెడితే వాళ్లూ అందరిలాంటి మనుషులే. వాళ్లకీ కష్టాలుంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌లో చాలా ఒడిదుడుకులు, మనస్ఫర్థలు ఉంటాయి. కొన్నాళ్లపాటు కలిసి కాపురం చేశాక కూడా విడిపోతుంటారు. మరో పెళ్లి చేసుకుని సెటిలైపోయేవారు కొందరు. ప్రేమ, రిలేషరన్ వల్ల మోసపోయి వివాహ బంధానికి దూరంగా ఉండేవారు మరి కొందరు. సాధారణంగా ఒకసారి విడాకులు తీసుకున్న తర్వాత తమ గతం గురించి మాట్లాడడానికి ఇష్టపడరు నటీనటులు. కానీ విడిపోయి ఇన్నేళ్లవుతున్నా తన మాజీ భర్త అంటే ఇప్పటికే ఇష్టమేనని చెప్తూ సీనియర్ నటి నళిని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
1981లో తమిళంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ – చిరంజీవి కలిసి చేసిన ‘రణువ వీరన్’ మూవీతో నళిని కెరీర్ స్టార్ట్ అయింది. ఈ చిత్రం తెలుగులో ‘బందిపోటు సింహం’ పేరుతో డబ్ అయింది. తర్వాత చిరంజీవి సరసన కథానాయికగా ‘సంఘర్షణ’ (1983), ‘ఇంటిగుట్టు’ (1984) చిత్రాల్లో నటించారామె. అప్పటి నుంచి 1988 వరకు సంవత్సరానికి 5 నుండి 20 సినిమాల వరకు చేసేవారు. కన్నడ, మలయాళం భాషల్లోనూ నటించారు. తమిళ్, మలయాళం, తెలుగులో షోలు, సీరియల్స్ కూడా చేశారామె. 2002లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. రవితేజ ‘వీడే’, నందమూరి హరికృష్ణ ‘సీతయ్య’ సినిమాల్లో లేడీ విలన్‌గా ఆకట్టుకున్న నళిని.. తెలుగులో చివరిగా ‘బ్రాండ్ బాబు’ లో కనిపించారు. ‘అమ్మ నా కోడలా’, ‘భాగ్యరేఖ’ తర్వాత ‘జానకి కలగనలేదు’ సీరియల్‌లో కనిపించి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ఓ ఇంటర్వూలో తన ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారామె.
ఆమె మాట్లాడుతూ.. ‘కథానాయికగా నటిస్తున్న టైంలో ఏడాదికి 24 సినిమాలు చేస్తే బిజీగా ఉండేదాన్ని. కేవలం తినడం, నిద్ర పోవడం కోసమే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అలాంటప్పుడు నటుడు రామ రాజన్‌తో ప్రేమలో పడ్డాను. కొన్నాళ్లకు మా ప్రేమ విషయం మా ఇంట్లో చెప్పాను. దాంతో వాళ్లు రామరాజన్‌తో కలిసి నటించడానికి ఒప్పుకోలేదు. తను మంచి నటుడు. బంగారం లాంటి మనిషి. తర్వాత మా ఇద్దరికీ ఎందుకో సెట్ కాలేదు. విడిపోయాం. కానీ ఇప్పటికీ తనను ప్రేమిస్తున్నా. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు’ అని చెప్పుకొచ్చారు. ఇంకో వెర్షన్ ఏంటంటే.. నళిని జాతకాలను బాగా నమ్ముతారట. వీరి వివాహం తర్వాత పిల్లల విషయంలో కొందరు జ్యోతిష్యులు చెప్పిన కారణాల వల్ల, జరిగిన పరిణామాల వల్ల విడిపోవాల్సి వచ్చిందని.. దాంతో 13 సంవత్సరాల వైవాహిక బంధం నుండి వేరు పడ్డారని, ఇది జరిగి 20 సంవత్సరాలవుతున్నా నళిని ఇంకా రామ రాజన్‌ని మర్చిపోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : మెగాస్టార్ ముద్దాడుతున్న ఈ లేడీ విలన్ ఎవరో తెలుసా?