Nakshatra: ఈ మధ్య కాలంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోయాయి. కొందరు మృగాళ్లు విచ్చల విడిగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. లైంగిక వేధింపులు పాల్పడ్డానికి కాదేదీ అనర్హం అన్నట్లు.. ఎక్కడ పడితే అక్కడ మహిళల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా, ఓ సీరియల్ నటి సోదరిపై బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. బస్సులో ప్రయాణం చేస్తున్న ఆమెతో అర్థరాత్రి అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే.. తమిళ సీరియల్స్ ‘వల్లి తిరుమనమ్’’, ‘‘ యారాడి నీ మోహిని’’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నక్షత్ర.
కొద్దిరోజుల క్రితం ఆమె చెల్లెలు చెన్నై నుంచి కేరళ వెళ్లటానికి ఓ ట్రావెల్ బస్ ఎక్కింది. అర్థరాత్రి సమయంలో ఆమె నిద్రలో ఉండగా రెండో బస్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. మెలుకువ వచ్చి చూసి అడిగే సరికి పొరపాటున తగిలిందని సమాధానం ఇచ్చాడు. సదరు డ్రైవర్ కీచక బుద్ధి గమనించిన ఆమె బస్సులోని మిగిలిన వారిని నిద్రలేపి విషయం చెప్పింది. తర్వాత అతడు తప్పు చేశాడని తేలింది.
బస్సులోని మరి కొందరు కూడా అతడు తమతో తప్పుగా ప్రవర్తించాడని చెప్పారు. బస్ డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటి నక్షత్ర ఈ ఘటన గురించి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు పెట్టారు. తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు ఆ డ్రైవర్‌పై కఠిన చర్యలు చేసుకోవాలని కోరారు. రెండు రాష్ట్రాల పోలీసులు కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ.. ప్రభాస్ స్పెషల్!