సామాన్యంగా సెలబ్రిటీ హోదా వచ్చాక.. నటీమణులు లగ్జరీ కార్లు, బైక్, వాచ్, బ్యాగ్స్ వంటివి ఖరీదైనవి కొంటుంటారు. అవి ఏదో ఒక సందర్భంలో బయటపడుతుంటాయి. తాజాగా స్టార్ హీరోయిన్ ఓ ఖరీదైన కారును కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల తెలుగు తెరపై అందమైన సీతగా అలరించిన నటి మృణాల్ ఠాకూర్. సంప్రదాయమైన కట్టు, బొట్టుతో పదహరణాల తెలుగుమ్మాయిగా కనిపించి మెప్పించింది మృణాల్. ఈ సినిమాతో ఆమె కెరీర్ ఒక్కసారిగా పుంజుకుంది. వరుసగా సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తొలుత సీరియల్ పలు సీరియల్స్ లో నటించింది. బుల్లి తెర నుండి వెండి తెర మీదకు అడుగుపెట్టింది. లవ్ సోనియా, సూపర్ 30, బట్లా హౌస్ వంటి పలు చిత్రాల్లో నటించింది. అనంతరం తెలుగులో సీతారామంలో నటించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో అటు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తుంది. నాని 30 మూవీలో కనిపించనుంది.
కాగా, ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది ఈ సుందరి. సామాన్యంగా సెలబ్రిటీ హోదా వచ్చాక.. నటీమణులు లగ్జరీ కార్లు, బైక్, వాచ్, బ్యాగ్స్ వంటివి ఖరీదైనవి కొంటుంటారు. అవి ఏదో ఒక సందర్భంలో బయటపడుతుంటాయి. తాజాగా మృణాల్ ముంబయి ఎయిర్ పోర్టులో దర్శనమివ్వగా.. ఇప్పుడు ఆమె వచ్చిన కారుపైనే చర్చంతా నడుస్తుంది. మెర్సిడెస్-బెంజ్-ఎస్ క్లాస్ సెడాన్ లగ్జరీ కారులో నుండి ఆమె దిగారు. ఆ సమయంలో కెమెరాలు క్లిక్ మనిపించాయి. ఈ కారు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు, వ్యాపార వేత్తలు కొనుగోలు చేస్తున్నారు. కాగా, ఆమె కూడా ఈ కారును కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఆ కారులో నుండి దిగిన వీడియోను ఓ యూట్యూబ్ చానల్ అప్ లోడ్ చేయడంతో ఆమె కొత్త కారు కొన్నారన్న వార్తలు వెలువడుతున్నాయి.
కాగా, ఈ కారు ప్రత్యేకత గురించి తెలిస్తే మీరు కళ్లు తేలేయాల్సిందే. మెర్సిడెస్-బెంజ్-ఎస్ క్లాస్ కారులో మొత్తం మూడు వేరియంట్లు ఉంటాయి.
350డి, 400డి, 450డిలు ఉన్నాయి. అయితే నటి వాడుతున్న కారు ఎస్ 450డి గా తెలుస్తుంది. ఈ వేరియంట్ ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో లేదని తెలుస్తోంది. ఈ కారులో అనేక ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇది 12.3-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే, 12.8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆటోమేటిక్ గేర్ బాక్స్ జతచేయబడిన ఇంజన్,362 బీహెచ్ పి, 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 450డి మోడల్ 3 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. Mercedes-Benz S-క్లాస్ మోడల్ ప్రారంభ దర రూ. 1.71 కోట్లు.. రూ.2.17 కోట్లు వరకు ఉంటుందట.