క్యాస్టింగ్ కౌచ్ ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో ఉంది. ఒక డైరెక్టర్ హీరోయిన్ కి సినిమా అవకాశం ఇస్తా రమ్మని పిలిస్తే వెళ్ళలేదు. ఆరోజు వెళ్లలేనందుకు ఇప్పుడు బాధపడుతుంది. వెళ్లి ఉంటే మంచి అవకాశాలు వచ్చేవని ఫీలవుతుంది.
సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. అందం బట్టి అవకాశాలు వస్తాయన్న విమర్శలు చేసేవారు ఉన్నారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువే అన్న ఆరోపణలు చేసే హీరోయిన్స్ ని మనం రెగ్యులర్ గా చూస్తేనే ఉన్నాం. ఫలానా సినిమాలో అవకాశం ఉంది రా అని కాల్ చేస్తారు. తీరా వెళ్ళాక నాకేంటి అని అడుగుతారు అంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది అవకాశాల కోసం దర్శక, నిర్మాతలకు కమిట్మెంట్ ఇస్తారని, కొంతమంది ప్రాణం పోయినా కమిట్ అవ్వరని హీరోయిన్స్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఒక హీరోయిన్ మాత్రం డైరెక్టర్ పిలిస్తే వెళ్లలేదట. అంతేకాదు వెళ్లకుండా తప్పు చేశానే అని బాధపడిందట. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే?
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. దానికి అదృష్టం కూడా ఉండాలి. అయితే వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని వదులుకునేవారు కూడా లేకపోలేదు. అలాంటి అవకాశాన్నే పోగ్గుట్టుకుందట అలనాటి నటి మోనికా బేడి. తాజ్ మహల్ సినిమాతో వెండితెరకు పరిచయమైన మోనికా బేడి.. స్పీడ్ డాన్సర్, సోగ్గాడి పెళ్ళాం, శివయ్య, చూడాలనివుంది, సర్కస్ సత్తిపండు, వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. 1995 లో వచ్చిన ‘సురక్ష’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి.. అక్కడి సినిమాలతో బిజీ కావడంతో అక్కడే ఉండిపోయింది నటి మోనికా. తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టింది. డైరెక్టర్ ‘సుభాష్ ఘై’ హోళీ పార్టీలో రాకేష్ రోషన్ నా దగ్గరకు వచ్చాడు. అతడు నాకు నటుడిగానే తెలుసు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్న విషయం మాత్రం తెలియదు.
అతడు కాసేపు మౌనంగా ఉండి నా వైపు చూస్తున్నాడు. కాసేపు ఆగి నా దగ్గరికి వచ్చి చేతిలో విజిటింగ్ కార్డ్ చేతిలో పెట్టి రేపే నున్ను వచ్చి కలువు అని చెప్పాడు. నాకు ఏం అర్థం కాలేదు. ఇతడు నన్ను ఎందుకు పిలిచాడో అని అనుమానించి విజిటింగ్ కార్డ్ ను ముక్కలు ముక్కలు చేశాను. కొన్ని నెలల తర్వాత నా మేనేజర్.. ‘మేడం మీరు ఎందుకు రాకేష్ ను కలవలేదు అని అడిగాడు. అతడు కరన్ అర్జున్ సినిమా తీస్తున్నాడు. అందులో మీకు హీరోయిన్ పాత్ర ఇవ్వాలనుకున్నారు. సల్మాన్ ఖాన్ జోడిగా మమతా కులకర్ణి చేసిన క్యారెక్టర్ మీకు ఇద్దామని అనుకున్నాడు’ అని చెప్పాడు. అప్పుడు కానీ నేను చేసిన తప్పు అర్థం కాలేదు. డైరెక్టర్ రాకేష్ రోషన్ పిలిచినప్పుడు వెళ్లి ఉంటే సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే అవకాశం వచ్చేదని, మంచి ఛాన్స్ ని మిస్ చేసుకున్నానని బాధపడింది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.