తిరుమల శ్రీవారికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తగణం గురించి అందరికీ తెలిసిందే. రోజుకు లక్షల్లో భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇంక సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి లైఫ్ లో ఏ ముఖ్యమైన కార్యక్రమం ఉన్నా కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. బుధవారం సినీ నటులు మెహరీన్, సుడిగాలి సుధీర్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
బుధవారం తెల్లవారుజామున వేర్వేరు సందర్భాల్లో హీరోయిన్ మెహరీన్, బుల్లితెర కమేడియన్- హీరో సుడిగాలి సుధీర్ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శుప్రభాత సేవలో పాల్గొన్న వీళ్లు వారి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత వీరికి రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వాదం అందించారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని అందిచడమే కాకుండా.. పట్టువస్త్రంతో సత్కరించారు. ప్రస్తుతం వీరి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంక సినిమా విషయానికి వస్తే.. F3 సినిమా తర్వాత మెహరీన్ స్పార్క్ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. అమెరికా సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ విక్రాంత్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కానున్నాడు. ఇంక కన్నడలో నీ సిగూవరేగు అనే సినిమాలో నటిస్తోంది. సుడిగాలి సుధీర్ విషయానికి వస్తే.. బుల్లితెరపై అతనికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమేడియన్ గా సుధీర్ ఎంత సక్కెస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు హీరోగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. వాంటెడ్ పండుగాడు- గాలోడు సినిమాలతో మంచి మార్కులే కొట్టేశాడు. కానీ, ఇంకా హీరోగా సరైన స్థానం సంపాదించుకోలేకపోయాడు.