తెలుగు ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటివారిలో మెహ్రీన్ ఒకరు. నేచురల్ స్టార్ నాని సరసన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ పంజాబీ భామ. ఆ తర్వాత రవితేజ నటించిన రాజా ది గ్రేట్ తో మంచి విజయం అందుకుంది. అలా వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మధ్య సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు. కానీ.. ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతోంది.
ప్రస్తుతం మెహ్రిన్ మాల్దీవ్స్ వెకేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మాల్దీవుల్లో మెహ్రిన్ పొట్టి బట్టలు వేసుకొని అందాల విందు చేస్తుంది. చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని బోట్ పై సముద్ర తీరాన తన పరువాల ప్రదర్శనతో కుర్రాళ్లకు మతులు పోగొట్టేలా చేస్తుంది. రెడ్ డ్రెస్ లో జలపాతం వద్ద ఇంద్రధనస్సుతో పోటీ పడుతూ ఫోజులో ఇచ్చింది. మెహ్రిన్ సోయగాలకు కుర్రకారు ఫిదా అవుతుండగా.. ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఇటీవలే ఓ పొలిటిషన్ తో ఎంగేజ్మెంట్, పెళ్లి వరకు వెళ్లిన మెహ్రీన్.. ఏమైందోగాని కొద్దిరోజులకే అతనికి నో చెప్పేసింది. ఎప్పుడైతే పెళ్లి క్యాన్సల్ అయ్యిందో అప్పటినుండి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ రెచ్చిపోతుంది. రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో’ ఎఫ్3′ మూవీలో కనిపించింది. సినిమా హిట్ అయినప్పటికీ, తెలుగులో పెద్దగా అవకాశాలు తగ్గినట్లుగా టాక్ నడుస్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘స్పార్క్’ చిత్రంలో నటిస్తుంది మెహ్రీన్. అలాగే ‘నీ సిగువరేగు’ అనే కన్నడ చిత్రంలో కూడా నటిస్తుంది. ఇదిలా ఉండగా.. షూటింగ్ లో ఏమాత్రం గ్యాప్ దొరికినా ఈ అమ్మడు ఫారెన్ టూర్లకు చెక్కేస్తుంది. ప్రెజెంట్ మెహ్రీన్ గ్లామరస్ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.