నటి మెహ్రీన్.. తెలుగు చిత్ర పరిశ్రమలో అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. నానీ హీరోగాతెరకెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమా గాధ చిత్రంతో ఈ అమ్మడు తెలుగు తెరపై మెరిసింది. దీంతో అప్పటి నుంచి అందివచ్చిన అవకాశాలను అందుకుంటూ టాలీవుడ్ లో నటిగా మెహ్రీన్ మంచి గుర్తింపునే మూటగట్టుకుంది. ఇక విషయం ఏంటంటే..? తాజాగా మెహ్రీన్ తన సోషల్ మీడియా ఖాతాలో సినిమా ప్రపంచంలో తాను ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమోషనల్ గా రాసుకొచ్చింది..
నటీ నటుల జీవితాలు చాలా గందరగోళంగా ఉంటాయి. సినిమాల్లోని పాత్రలకు తగ్గట్టుగా లుక్స్ కోసం శారీరకంగా కఠినమైన శిక్షణ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇక ఇవే కాకుండా షూటింగ్ షెడ్యూల్స్‌కు తగ్గట్లుగా జీవనశైలిలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు రావడం కామన్. మా లైఫ్ లో ఎత్తు పల్లాలు సహజం. రాత్రికి రాత్రే మా జీవితాలు మారిపోవడం, విజయం దక్కిందని సంతోషపడే లోపే వైఫల్యం ఎదురొస్తుంది.
ఇక వీటిని మించి ఎండా, వాన, చలి అనేవి కూడా లెక్కచేయకుండా షూటింగ్‌లో పాల్గొనాల్సిన పరిస్థితులు ఫేస్ చేస్తుంటాం. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలుసు. అదేవిధంగా సినిమాల కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అయినా అన్నీ తెలిసి కూడా ఈ రంగాన్ని ఎంచుకుంటాం” అని మెహ్రీన్ తన పోస్టులో ఎమోషనల్ గా తన అనుభవాన్ని, పడుతున్న కష్టాలను తెలెపే ప్రయత్నం చేసింది.
మెహ్రీన్ ప్రస్తుతం విక్గరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న F3 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్నో అంచనాలు ఉన్న ఈ మూవీ మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక హీరోయిన్ మెహ్రీన్ తాజాగా చేసిన పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.