బాల నటిగా ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోయిన్ స్టేజీకి చేరుకుంది.. నటి మీనా. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇటీవల అరుదైన దుబాయ్ గోల్డెన్ వీసాను కూడా అందుకుంది. ఇక కెరీర్‌లో ఒడిదుడుకులు ప్రారంభం అయిన సమయంలోనే.. ప్రముఖ వ్యాపారవేత్త విద్యాసాగర్‌ని వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె నైనిక ఉంది. ఈ చిన్నారి కూడా సినిమాల్లో నటిస్తుంది.
ఇది కూడా చదవండి: కరోనా పై నటి మీనా సెటైరికల్ ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్!
కుమార్తె జన్మించిన తర్వాత కొన్నాళ్లు కెరీర్‌కి బ్రేక్ ఇచ్చింది మీనా. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హీరోయిన్ పాత్రలే కాక సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా ఓకే చెబుతోంది. మరోవైపు బుల్లితెర ప్రోగ్రామ్స్ పరంగా కూడా మీనా బిజీ అవుతోంది. ఇక సోషల్ మీడియాలో పెద్ద యాక్టీవ్‌గా ఉండని.. మీనా.. ఈ మధ్య రూటు మార్చి.. తన ఫోటోషూట్‌లు, డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మీనా షేర్ చేసిన ఓ వీడియో అభిమానులను షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఇది కూడా చదవండి: తల్లిమాట విన్న హీరోయిన్ మీనా ఏం కోల్పోయింది?!!తాజాగా షేర్ చేసిన వీడియోలో గర్భవతిగా కనిపించిన మీనా.. ”చాలా మార్పులొచ్చాయి. అప్పట్లో ఈ గెటప్ వేయడం చాలా సులభంగా ఉండేది. దీన్ని కవర్ చేసేందుకు హెవీ చీరలు కట్టుకునేదాన్ని. కానీ ప్రస్తుతం ఈ గెటప్‌కు, ఈ రోల్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. షిఫాన్ చీరలు కట్టుకున్నా చూడటానికి చాలా నాచురల్‌గా ఉంది” అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేసింది. అంటే తన అప్‌కమింగ్ సినిమాలో గర్భవతిగా కనిపించబోతున్నట్లు చెప్పిందన్నమాట మీనా. ఇది చూసిన నెటిజనులు తొలుత ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.