బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ హోస్ట్ గా నిర్వహిస్తున్న ‘లాక్ అప్’ రియాలిటీ షోలో రోజుకో కంటెస్టెంట్ తన లైఫ్ లోని సీక్రెట్ రిలేషన్ షిప్ ని బయట పెడుతున్నారు. తాజాగా నటి, మోడల్ మందనా కరిమి.. తన లైఫ్ లోని సీక్రెట్ రిలేషన్ బయటపెట్టింది. బాలీవుడ్ లో ఓ ఫేమస్ డైరెక్టర్ తనను గర్భవతిని చేసి వదిలేశాడని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ఎలిమినేషన్ రౌండ్ నుండి తప్పించుకునే క్రమంలో మందనా సీక్రెట్ రిలేషన్ ఆప్షన్ ఎంచుకుంది.
ఇక మందనా మాట్లాడుతూ.. “నేను విడాకులు తీసుకునే టైంలో మహిళల హక్కుల గురించి మాట్లాడే ఓ ప్రముఖ దర్శకుడితో నాకు సీక్రెట్ రిలేషన్ ఏర్పడింది. ఆయన యువతరానికి చాలా ఆదర్శం. అప్పటికి విడాకులు తీసుకోలే కాబట్టి అతనితో నా సంబంధం రహస్యంగా సాగింది. లాక్ డౌన్ లో ఇద్దరం కలిసి ఒకేచోట ఉన్నాం. ఇద్దరం ఇష్టపడి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశాం. కానీ ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్ అని తెలిసిందో అప్పటినుండి దూరం పెట్టేశాడు.
ఎందుకని అడిగితే.. తాను మానసికంగా సిద్ధంగా లేనని చెప్పాడు. అదీగాక 33 ఏళ్ల వయస్సులో నువ్ ఇంత ఈజీగా గర్భం దాల్చుతావని అనుకోలేదు అన్నాడు. అప్పటికే అతనికి పెళ్ళై ఓ పాప కూడా ఉంది. తర్వాత ఇద్దరం తన బెస్ట్ ఫ్రెండ్ పేరెంట్స్ తో మా సమస్యను చర్చించాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్లేసరికి తన ఫ్రెండ్స్ తో తాను ప్రెగ్నెన్సీని అంగీకరించడానికి రెడీగా లేనని, అబార్షన్ చేయించుకోవాలని చెప్పించాడు.
నేను కుదరదని చెప్పేసి వచ్చాను. అప్పటినుండి నా మీద నా భార్య పెట్టిన పోలీస్ కేసులు అలాగే ఉన్నాయని చెప్పేవాడు. నేను డిప్రెషన్ కి గురై ఇంటికి వచ్చాక బాగా ఆలోచించి అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు అతని పేరు చెప్పేలేను. ఎందుకంటే అతనికి పేరుతో పిలిపించుకునే అర్హత లేదు” అని ఏడుస్తూ చెప్పింది. ఇదిలా ఉండగా.. మందనా 2017లో బిజినెస్ మ్యాన్ గౌరవ్ గుప్తాను పెళ్లాడింది. కానీ కొంతకాలానికే విబేధాల వలన విడిపోయింది. ఇక ప్రస్తుతం మందనాను మోసం చేసిన ఆ డైరెక్టర్ ఎవరా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరి ఈ నటికి జరిగిన అన్యాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
.@manizhe ke secret revelation se hua #LockUpp emotional.
Watch the Judgement Day episode streaming tonight at 10:30 pm
Play the @LockuppGame now. pic.twitter.com/R7jGtL0tbc
— ALTBalaji (@altbalaji) April 10, 2022