సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ బట్టి మార్పులు జరుగుతుంటాయి. ఆ ట్రెండ్ ఫాలో అవుతూ భాషాబేధం లేకుండా గ్లామర్ షో చేస్తుంటారు హీరోయిన్లు. ప్రస్తుతం గ్లామర్ ట్రెండ్ నే ఫాలో అవుతోంది మలయాళీ బ్యూటీ మాళవిక మోహనన్. కెరీర్ ప్రారంభం నుండే సోషల్ మీడియాలో తన అందాలతో ఫాలోయింగ్ వెనకేసుకుంటుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కూతురుగా ఇండస్ట్రీలో డెబ్యూ చేసిన మాళవిక.. ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంది.
ఇప్పటివరకు మాళవిక సినిమాలతో కంటే గ్లామరస్ ఫోటోషూట్స్ తోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ తాజాగా ఆ గ్లామర్ షోనే తనను వివాదాల్లో నిలిపిందని అంటోంది. మాళవిక తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ భామ అందాలకు తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ బీభత్సంగానే ఉంది. తాజాగా తన ఫోటోను అసభ్యకరంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని వార్తల్లో నిలిచింది మాళవిక.తన ఫోటో ఫేక్ అయినా షేర్ చేసారంటూ పలు మీడియా సంస్థలపై మాళవిక అసహనం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మాళవిక కొన్ని నెలల కిందట పోస్ట్ చేసిన ఓ ఫోటోను అసభ్యకరంగా ఎడిట్ చేసి సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ చేసేశారు. ఆ ఫోటో విషయం మాళవిక చెవిన పడేసరికి అలా షేర్ చేసిన మీడియా సంస్థలపై ‘చీప్ జర్నలిజం’ అంటూ మండిపడింది. ఇక ఆ ఫోటో ఎక్కడ కనిపించినా వెంటనే రిపోర్ట్ కొట్టాలని ఫ్యాన్స్ ని కోరింది మాళవిక.
This is a photo of mine from a few months back which somebody has photoshopped and created a fake vulgar one. A lot of people have been circulating that including media houses like @AsianetNewsTM , which is just cheap journalism. If you see the fake one please help & report. pic.twitter.com/y9QXDf5HHf
— malavika mohanan (@MalavikaM_) February 2, 2022
ప్రస్తుతం మాళవిక పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. మాళవిక నటించిన ‘మారన్’ సినిమా విడుదలకు రెడీ అయింది. మరోవైపు ‘యుద్ధ’ అనే సినిమాతో బాలీవుడ్ లో డెబ్యూ చేయనుంది అమ్మడు. మరి మాళవిక ఫోటోషూట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.