కేజీఎఫ్ ఫేమ్, ప్రముఖ కన్నడ నటి మాళవిక అవినాష్ జీవితంలో పెను విషాదం దాగి ఉంది. ఆమె కుమారుడు ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ఆమె ‘వీకెండ్ విత్ రమేష్’ షోలో చెప్పుకొచ్చారు.
సినిమా వాళ్ల జీవితాలేమీ నల్లేరు మీద నడకలు కాదు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే వారి జీవితాల్లోనూ ఏన్నో విషాదాలు దాగి ఉంటాయి. అలాంటి విషాదాల గురించి తెలుసుకున్నపుడు తప్పక కన్నీళ్లు పెట్టాల్సి వస్తుంది. కేజీఎఫ్ సినిమాతో దేశ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న నటి మాళవిక అవినాష్ జీవితంలోనూ ఓ పెను విషాదం దాగి ఉంది. ఆ విషాదం ప్రతి నిత్యం ఆమెను వేధిస్తూనే ఉంది. ఇంతకీ ఆ విషాదం ఏంటంటే.. మాళవిక కుమారుడు ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి కారణంగా 20 ఏళ్ల వయసులోనూ చిన్న పిల్లాడిలా ఉన్నాడు. తన పనులు తాను చేసుకోలేని పరిస్థితి ఉంది. తన కుమారుడి పరిస్థితిపై మాళవిక ప్రతి నిత్యం కుమిళిపోతూ ఉంటారు. దేవుడా ఎందుకు నాకిలాంటి శిక్ష వేశావు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు.
తాజగా, ఓ టీవీ షోలో ఆమె తన కుమారుడి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రముఖ కన్నడ నటుడు రమేష్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘వీకెండ్ విత్ రమేష్’కు తన కుమారుడిని తీసుకువచ్చారు. ఓ షోకు ఆమె తన కుమారుడ్ని తీసుకురావటం ఇదే మొదటి సారి. ఈ షోలో మాళవిక తన కుమారుడి గురించి మాట్లాడుతూ.. ‘‘ నా కుమారుడు ఓల్ఫ్ హెర్షన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి విషయం కొంతకాలం క్రితం తెలిసింది. మొదట్లో ఏ డాక్టరూ దీని గురించి మాకు చెప్పలేదు. ఈ వ్యాధి ఉంటే బుద్ధిమాంధ్యం వస్తుంది. మాట్లాడలేరు.
నడవటం కూడా ఇబ్బంది అవుతుంది. మీరు చాలా దురదృష్టవంతులు అని డాక్టర్లు అన్నారు. పుట్టినప్పటినుంచి అతడు అందరిలా లేడు. అతడ్ని చూసిన ఒక్కోరు ఒక్కో విధంగా కామెంట్లు చేసేవారు. 2018లో అతడి ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. 50రోజులు ఆస్పత్రిలో ఉన్నాడు. మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతాడేమో అనుకున్నాం. కానీ, బతికాడు. ఇప్పుడు అతడ్ని కేర్ టేకర్ చూసుకుంటుంది’’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి, కేజీఎఫ్ నటి జీవితంలోని ఈ విషాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.