కొద్దిరోజుల క్రితం ప్రముఖ కన్నడ నటి మాన్విత తల్లి సుజాత కమాత్ మరణించారు. ఈ విషాద ఘటన మరువక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటి మహిమ చౌదరి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
ప్రముఖ నటి మహిమ చౌదరి గత కొన్ని నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. 2022లో ఆమెకు బ్రీస్ట్ క్యాన్సర్ ధ్రువీకరణ అయింది. ఇక, అప్పటినుంచి ఆమె క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నారు. దానితో తీవ్ర పోరాటం చేసి విజయం సాధించారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న ఆమెకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మహిమ చౌదరి తల్లి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నాలుగు రోజుల క్రితం తుది శ్వాస విడిచారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మహిమ చౌదరి ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. తన తల్లి చనిపోయిన విషయాన్ని ధ్రువీకరించారు. ‘‘ నాకు ఎంతో సన్నిహితురాలైన నా తల్లి చనిపోయింది’’ అంటై ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, బ్రీస్ట్ క్యాన్సర్‌తో చేసిన పోరాటంలో మహిళ గెలుపు సాధించారు. కొన్ని నెలల పాటు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఆమె క్యాన్సర్ నుంచి బయటపడ్డారు. కాగా, గత బుధవారం ప్రముఖ కన్నడ నటి మాన్విత తల్లి సుజాత కమాత్ మరణించారు. గత కొన్ని నెలలుగా కిడ్నీకి సంబంధించిన సమస్యతో బాధపడుతున్న సుజాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వైద్యులు ఆమెకు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. బుధవారం సుజాత ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి, ఆమె తుది శ్వాస విడిచారు. తల్లి మరణంపై మాన్విత ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. తల్లితో ఉన్న ఓ ఫొటోను షేర్ చేసి, ‘ఆమె వదిలి వెళ్లిపోయింది’ అని పేర్కొన్నారు.