ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి ఎలాంటి న్యూ అప్ డేట్స్ తెలిసినా.. సోషల్ మీడియాలో కనిపించినా ఫ్యాన్స్ లో కనిపించే ఆనందం వేరు. ఇండస్ట్రీలో అందమైన ప్రేమ జంటలలో నటుడు శివబాలాజీ, మధుమిత జంట ఒకటి. వీరిద్దరూ హీరో హీరోయిన్స్ గా కెరీర్ ప్రారంభించి.. ప్రేమించుకొని.. పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. తాజాగా పుష్ప సినిమాలోని 'ఊ అంటావా మావ..' పాటకు స్టెప్స్ వేస్తూ అదరగొట్టింది.
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి ఎలాంటి న్యూ అప్ డేట్స్ తెలిసినా.. సోషల్ మీడియాలో కనిపించినా ఫ్యాన్స్ లో కనిపించే ఆనందం వేరు. రెగ్యులర్ గా కాకుండా ఎప్పుడో ఓసారి తెరపై కనిపించే సెలబ్రిటీలు తారసపడితే.. కామన్ ఆడియెన్స్ నుండి వచ్చే రియాక్షన్ వేరుగా ఉంటుంది. ఏంటి.. ఇన్నాళ్లు ఏమైపోయారు? సినిమాలలో కూడా కనిపించట్లేదని అంటుంటారు. ఇండస్ట్రీలో అందమైన ప్రేమ జంటలలో నటుడు శివబాలాజీ, మధుమిత జంట ఒకటి. వీరిద్దరూ హీరో హీరోయిన్స్ గా కెరీర్ ప్రారంభించి.. ప్రేమించుకొని.. పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఇన్నేళ్ళలో ఏనాడూ వీరు నెగిటివ్ వార్తలలో నిలువలేదు.
అంత జాగ్రత్తగా వారి ప్రేమ బంధాన్ని, వివాహ బంధాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్నో జంటలు పెళ్ళైన కొన్నాళ్లకే విడిపోవడం చూస్తున్నాం. కానీ.. పదమూడేళ్లుగా బాలాజీ, మధుమిత ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకానొక దశలో నటుడిగా బిజీ అయిన శివబాలాజీ.. ఆ తర్వాత బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నుండి సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటున్నాడు. ఈ మధ్య టీవీ షో ‘మిస్టర్ అండ్ మిసెస్’ అనే రియాలిటీ షోలో జడ్జిగా సందడి చేస్తున్నాడు. కాగా.. శివబాలాజీ యాక్టీవ్ గా ఉన్నట్లుగా ఆయన భార్య మధుమిత సోషల్ మీడియాలో అరుదుగా పోస్టులు పెడుతుంటుంది.
ఇదిలా ఉండగా.. మధుమిత ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపించినా శివబాలాజీతోనే కనిపిస్తుంది. తాజాగా పుష్ప సినిమాలోని ఐటెమ్ సాంగ్ ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా’ అనే పాటకు భర్తతో కలిసి అదిరిపోయే స్టెప్స్ వేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో మధుమిత డ్రెస్సింగ్ స్టైల్ కి.. ఆమె చేసిన హాట్ ఎక్స్ ప్రెసివ్ డాన్స్ కి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. అదేంటీ.. మధుమిత కనిపించడమే రేర్ అనుకుంటే.. ఈసారి ఇలా కిక్కిచ్చే డాన్స్ తో సర్ప్రైజ్ చేసిందని అంటున్నారు ఫ్యాన్స్. అయితే.. వీరితో పాటు ఆట సందీప్ కూడా ఆ వీడియోలో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మరి మధుమిత డాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.