Madhu Shalini: ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇంతకాలం బ్యాచిలర్ లైఫ్ ని ఆస్వాదించిన హీరోయిన్లు, సీరియల్ ఆర్టిస్టులంతా ఈ మధ్యే పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. ఒక్కొక్కరుగా వరుసగా పెళ్లి వార్తలతో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నారు. ఇటీవలే స్టార్ హీరోయిన్ నయనతార – విగ్నేష్ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి తెలుగు బ్యూటీ, హీరోయిన్ మధుశాలిని చేరింది.
పదిహేనేళ్ల క్రితమే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మధుశాలిని.. అందరివాడు సినిమాతో తెలుగు డెబ్యూ చేసింది. ఆ తర్వాత అల్లరి నరేష్ సరసన కితకితలు సినిమా చేసి మంచిక్రేజ్ దక్కించుకుంది. అనంతరం తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే.. హీరోయిన్ గా సినిమాలైతే చేసింది కానీ.. ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్స్ కే పరిమితం అయింది. ఇక అడపాదడపా తెలుగు, తమిళ సినిమాలు చేసుకుంటూ కెరీర్ కంటిన్యూ చేస్తోంది.
ఇదిలా ఉండగా.. ఈ భామ చడీచప్పుడు లేకుండా పెళ్లి చేసుకొని అందరినీ సర్ప్రైజ్ చేసింది. తమిళ సినీ నటుడు గోకుల్ ఆనంద్ తో మధుశాలిని వివాహం జూన్ 16న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. వీరి వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మధుశాలిని – గోకుల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. వీరిద్దరిది లవ్ మ్యారేజ్ అని టాక్.
2019లో పంచాక్షరం అనే తమిళ సినిమాలో మధు శాలిని, గోకుల్ కలిసి నటించారు. ఈ సినిమా టైమ్‌లోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఇండస్ట్రీ టాక్. ఇక గోకుల్ ఆనంద్ తమిళంలో అరడజను సినిమాల్లో, పలు వెబ్ సిరీస్‌ల్లో నటించాడు. ఇప్పుడు ఈ కొత్త దంపతులకు సినీ ఇండస్ట్రీ నుండి, ఫ్యాన్స్ నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి మధుశాలిని – గోకుల్ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.