ప్రస్తుతం కాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగాక.. సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ 10వ తరగతిలో దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో హీరో, హీరోయిన్ లకు సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఓ హీరోయిన్ కు సంబంధించిన 10 వ తరగతి నాటి పాస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రెండు జడలు వేసుకుని, స్కూల్ యూనిఫాం లో ఉన్న ఆ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయాక.. సెలబ్రిటీలు ఏ చిన్న విషయాన్ని అయిన అభిమానులతో పంచుకుంటుంటారు. అలా వారి చైల్డ్ హుడ్ పిక్ లతో పాటుగా.. స్కూల్, కాలేజీలో చదివినప్పటి ఫోటోలు కూడా షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తన 10వ తరగతి చదువుతున్నప్పటి ఫోటోని సోషల్ మీడీయాలో షేర్ చేసింది హీరోయిన్ మాధవీ లత. 10వ తరగతి హాల్ టికెట్ కోసమని తీసుకున్న ఫిక్ ను అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోలో వైట్ కలర్ యూనిఫాంలో రెండు జడలు వేసుకుని ముద్దొచ్చెలా ఉంది మాధవీలత. ఇక మాధవీలత చిన్న పాత్రలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. 2008లో రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించింది ఈ అమ్మడు. ఈ సినిమాలో నటనకు గాను మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. దాంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ష్, స్నేహితుడా, ఉసురు, అరవింద్ 2 లాంటి సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం చిన్నా చితకా సినిమాల్లో నటిస్తూ.. ఉన్నారు మాధవీలత. మరి మాధవీలత 10వ తరగతి నాటి పిక్ పై నెట్టింట పలు కామెంట్స్ వస్తున్నాయి. ఇంత అందంగా ఉన్న మీకు ఎవరూ ప్రపోజ్ చెయ్యలేదా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. మీలాంటి వాళ్లు ఎవరూ తగల్లేదని సమాధానం ఇచ్చింది. మరి మాధవీలత 10వ తరగతి నాటి ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.