మాధవీలత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉన్నారు.
మాధవీలత ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘నచ్చావులే’ సినిమాతో మాధవీలత సినీ పరిమశ్రకు పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాదు! నచ్చావులే హిట్టు కావటంతో వరుస ఆఫర్లు మాధవీలత సొంతం అయ్యాయి. అయితే, 2008లో మొదలైన ఆమె కెరీర్ ఎక్కువ కాలం సాఫీగా సాగలేదు. 2015 వచ్చే సమయానికి ఆఫర్లు చాలా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేవని సమాచారం. మాధవీలత సినిమాలకు దూరంగా ఉన్నా.. కాంట్రవర్సీలకు మాత్రం చాలా దగ్గరగా ఉంటున్నారు. తరచూ ఏదో ఒక విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసి..
వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా, ఆమె పెళ్లిపై బోల్డ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో పెళ్లి గురించి కొంతమంది ఆమెను పలు ప్రశ్నలు వేశారు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఆమె స్పందిస్తూ.. ‘‘ ప్రియమైన సమాజం. ఓ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే వయసు ఒకటే సరిపోదు. ఆమె శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి. పెళ్లి చేసుకోవటం అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయం’’ అని స్పష్టం చేశారు. కాగా, మాధవీలత బిగ్‌బాస్‌పై.. హీరో నాగార్జునపై గతంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ హౌస్ ముద్దులు, హగ్గులు, రొమాన్స్ కి అడ్డాగా మారిందని ఆమె పేర్కొన్నారు.
మరదలు అంటే రొమాన్స్ కాదు.. సరదా, సంతోషం.. బావ మరదలు మన సంప్రదాయంలో బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రిలేషన్ అని అన్నారు. ‘‘ వన్ కంట్రీ.. వన్ ఇండస్ట్రీ నా.. బొక్కేం కాదు… ఇక్కడ ఇదే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్‌కి స్కోప్ లేదు తమిళ్ కి వెళ్లు అన్నారు. వినేవాడు వీపీ అయితే చెప్పేవాడు మా నాగ్ మామ’’ అంటూ నాగార్జునపై ఫైర్ అయ్యారు. మరి, పెళ్లిపై మాధవీలత చేసిన కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.