పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్.. ఓటీటీ మొదటి సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈక్రమంలో ఈసారి 11 వారాలపాటు కొనసాగిన నటరాజ్ మాస్టర్ ఇటీవల ఎలిమినేట్ అయి బయటికి వచ్చారు. ఎలిమినేషన్ కి ముందు బిగ్ బాస్ హౌస్ లో ప్రాంతీయ వాదం తెరపైకి వచ్చింది. బిందు మాధవిపై నటరాజ్ మాస్టర్ కొన్ని ప్రాంతీయవాద కామెంట్స్ చేశాడు. అయితే నటరాజ్ మాస్టర్ ప్రాంతీయ భేదం తీసుకుని రావడంతో హోస్ట్ నాగార్జున చురకలు వేశారు. ఈ నేపథ్యంలోనాగార్జున ఇచ్చిన స్టేట్ మెంట్ పై మండిపడింది హీరోయిన్ మాధవి లత.
రీసెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లో తెలుగు అమ్మాయి బిందు మాధవిపై నటరాజ్ మాస్టర్ కామెంట్స్ చేశారు. బిందు మాధవి.. అసలు ఆమె తెలుగు హీరోయిన్ కాదు, ఆమెలో తెలుగు అమ్మాయిలో ఉండాల్సిన లక్షణాలు లేవంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. తెలుగులో అవకాశాలు లేక తమిళ్ కి వెళ్లిందని.. మళ్లీ ఇప్పుడు ఇక్కడ గేమ్ అనేసరికి వచ్చేసి.. మళ్లీ చెన్నై చెక్కేస్తుంది. అసలైన తెలుగు వాడ్ని నేనే.. తెలుగుప్రేక్షకులను 23 ఏళ్లుగా ఎంటర్టైన్ చేస్తున్నా.. నేను తెలుగులోనే చేస్తా” అంటూ మాట్లాడి..నటరాజ్ మాస్టర్ విమర్శల పాలయ్యారు. “సౌత్.. నార్త్.. చెన్నై.. తెలుగు ఇవన్నీ కాదు నటరాజ్ మాస్టర్.. వన్ కంట్రీ.. వన్ ఇండస్ట్రీ” అంటూ నటరాజ్ మాస్టర్‌కి గట్టిగానే నాగార్జున్ క్లాస్ పీకారు.ఈ నేపథ్యంలో నాగార్జున చేసిన స్టేట్ మెంట్ పై హీరోయిన్ మాధవి లత మండిపడింది. గత కొన్నాళ్లుగా బిగ్ బాష్ షోపై రివ్యూలు చెప్తూ.. విమర్శలు చేస్తుండేది.
ఇదీ చదవండి:నా వల్లే నాన్నకి ఇలా అయ్యింది.. నేను దురదృష్టవంతురాలిని అన్నారు: శివానీ రాజేశేఖర్ఈక్రమంలో అనేక విచిత్రమైన కామెంట్స్ ను కూడా ఆమె ఎదుర్కొంది. ఆమె ఫేస్ బుక్ స్టోరీలో వరుసగా పోస్ట్ లు పెడుతూ.. నాగార్జునపై ఫైర్ అయ్యారు. “వన్ కంట్రీ.. వన్ ఇండస్ట్రీ నా.. బొక్కేం కాదు… ఇక్కడ ఇదే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్‌కి స్కోప్ లేదు తమిళ్ కి వెళ్లు అన్నారు. వినేవాడు వీపీ అయితే చెప్పేవాడు మా నాగ్ మామ. అరే! పాపం నటరాజ్ మాస్టర్ గేమ్ ని గేమే అనుకున్నాడే కానీ.. బిగ్ బాస్ హౌస్‌లో మాస్క్ వేసుకోవాలి అనే విషయాన్ని మర్చిపోయాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిడానికి ప్లాన్ చేస్తున్నానని గత నాలుగేళ్లుగా నన్ను అంటున్నారు. రూ.10 కోట్లు ఇచ్చినా నేను బిగ్ బాస్ హౌస్‌కి పోను.. పోలేను”అంటూ మాధవి లత ఓ రేంజ్ లో ఫేస్ పోస్టులు పెట్టింది. మరి.. మాధవి లత సెటైర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Madhavi Latha Comments On Nagarjuna pic.twitter.com/UdW0tSULIG
— Rajasekhar (@Rajasek61450452) May 18, 2022