ఆమె ప్రముఖ నటి. పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అతడు స్టాండప్ కమెడియన్. ఓ సందర్భంలో కలిసిన వీళ్లిద్దరూ తొలుత ప్రేమించుకున్నారు. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎందుకంటే నటీనటుల దగ్గర నుంచి క్రికెటర్ల వరకు వరసగా మ్యారేజ్ చేసుకుంటున్నారు. నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేసేస్తున్నారు. అలా రీసెంట్ టైమ్స్ లో హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ లాంటి క్రికెటర్లు తమ ప్రేయసితో కొత్త బంధంలోకి అడుగుపెట్టారు. రీసెంట్ గా నటి శివలీకా ఒబెరాయ్.. ‘దృశ్యం’ దర్శకుడు అభిషేక్ పాఠక్ ని పెళ్లాడింది. ఇలా సెలబ్రిటీలందరూ కూడా దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో ప్రముఖ నటి చేరింది. ఆ ఫొటోలను పోస్ట్ చేసి తన పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించడంతో పాటు వెబ్ సిరీసుల్లో యాక్ట్ చేసిన మాన్వి గాగ్రూ, స్టాండప్ కమెడియన్ వరుణ్ కుమార్ ని పెళ్లి చేసుకుంది. ఫిబ్రవరి 23న తమ మ్యారేజ్ జరిగిందని చెబుతూ ఇన్ స్టాలో కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు మాన్వి చెప్పుకొచ్చింది. తమ జంటని ఆశీర్వదించాలని కోరింది. ఈ క్రమంలోనే నెటిజన్స్ ఆమెకు పెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక పెళ్లి కోసం మాన్వి ఎర్రచీరలో మెరిసిపోగా, వరుణ్ తెలుపు షేర్వాణిలో సందడి చేశాడు. ఈ జంటకు చూడచక్కగా ఉందని అందరూ వీళ్లను దీవిస్తున్నారు.
ఇదిలా ఉండగా 2008లో ‘ద చీతా గర్ల్స్: వన్ వరల్డ్’ మూవీతో నటిగా మారిన మాన్వి.. ఆ తర్వాత ‘నో వన్ కిల్డ్ జెస్సికా’, కిల్ దిల్, పీకే, ఉజ్డా చమన్, శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ తదితర చిత్రాల్లో సహాయపాత్రలు చేసింది. ఇక ఓటీటీల్లోనూ ద గుడ్ వైబ్స్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, మేడ్ ఇన్ హెవెన్, తమష్రీ తదితర వెబ్ సిరీస్ ల్లోనూ చెప్పుకోదగ్గ పాత్రలు చేసింది. మరోవైపు స్టాండప్ కమెడియన్, యాక్టర్, రైటర్ గా గుర్తింపు తెచ్చకున్న వరుణ్ కుమార్ తనదైన మార్క్ ఎంటర్ టైన్ మెంట్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ సందర్భంలో కలిసిన వీరిద్దరూ ఆ తర్వాత రిలేషన్ లోకి వెళ్లారు. తాజాగా పెళ్లి అనే బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు మీ బ్లెస్సింగ్స్ ని కింద కామెంట్ చేయండి.