నటి మాధవీ లత తన ఫేస్ బుక్ పేజ్ లో షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తాను ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉన్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ.
సాధారణంగా పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు, డేటింగ్ లు, విడాకులు సర్వసాధారణంగా జరిగే విషయాలు. అయితే కొంత మంది బయట కెమెరాలకు చిక్కినా గానీ తమ మధ్య ఏమీ లేదంటూ.. దాచే ప్రయత్నం చేస్తుంటారు. కానీ కొంత మంది ధైర్యంగా అవును మా ఇద్దరి మధ్య ప్రేమ ఆర్ డేటింగ్ ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా అలాంటి షాకింగ్ కామెంట్సే చేసింది నచ్చావులే హీరోయిన్ మాధవీ లత. సోషల్ మీడియాలో సామాజిక సమస్యలపై పోరాడుతూ ఉంటుంది మాధవీ లత. అయితే తన ఫేస్ బుక్ పోస్ట్ లో షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తాను ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉన్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
మాధవీ లత.. 2008లో వచ్చిన నచ్చావులే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత స్నేహితుడా, అరవింద్ 2 చిత్రాల ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో.. చిన్నచిన్నగా వెండితెరకు దూరం అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే 2018లొ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బీజీపీలో చేరి ఎన్నికల్లో సైతం పోటీ చేసింది. అయితే సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు.. తాజాగా ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ పోస్ట్ లో ఈవిధంగా రాసుకొచ్చింది మాధవీ లత.
“నేను ఓ వ్యక్తిని కలిశాను. అయితే ముందుగా నేను అతడిని పూర్తిగా అర్ధం చేసుకోవాలి. అదీకాక ఇద్దరి తల్లిదండ్రుల అనుమతి పొందాలి. ఇది అంత త్వరగా జరిగే పని కాదు. అసలు అతడిని నేను పెళ్లి చేసుకుంటానో లేదో, పెళ్లి గురించి మాత్రం అస్సలు అడగొద్దు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే? ఆ వ్యక్తి తెలుగు వ్యక్తి కాదు. ముఖ్యంగా నా నమ్మకాలను గౌరవించే వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను” అంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు మాధవీ లత. మీరు అనుకునే వ్యక్తి అయితే అతడు కాదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కావడంతో.. ఆ వ్యక్తి ఎవరా? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు.