చాలా మంది సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ఇండస్ట్రీలోకి వస్తుంటారు. ఈ క్రమంలో కొందరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యం డబ్బులు విషయంలో వారికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొందరు నిర్మాతలు నటీనటులకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటారు. దాదాపు అందరు నిర్మాతలు నటీనటులకు సమయానికి డబ్బులు ఇస్తుంటారు. కానీ కొందరు నిర్మాతలు మాత్రం సినిమా విడుదలైన తరువాత కూడా డబ్బులు ఇవ్వరు. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది ఆర్టిస్ట్ లో మీడియా ముందుకు వచ్చి చెప్పిన సందర్బాలు చాలా చూశాం. ఈ విషయంపై తాజాగా ఓ నటి కూడా తన అనుభవాన్ని తెలియజేశారు. ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి షేర్ చేసుకున్నారు. ఆమె ఎవరో కాదు నటి లిరీష. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరో గా నటించిన వకీల్ సాబ్ సినిమాలో లేడీ పోలీస్ పాత్రలో లిరీష నటించింది.
ఇటీవల విడుదలైన ‘వకీల్ సాబ్’ సినిమాలో పోలీస్ పాత్రలో నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి లిరీష. గతంలో కూడా అనేక సినిమాలో నటించింది. అంతేకాక బుల్లితెర కూడా పలు సీరియల్స్ లో చేసింది. అయితే చాలా వరకు నెగిటీవ్ పాత్రల్లోనే ఆమె నటించింది. లేడి విలన్ పాత్రలతో నటీ లిరీష్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలో సైడ్ క్యారెక్టర్ పాటు కొన్ని నెగిటివ్ పాత్రల్లో చేసింది. ఇక ప్రస్తుతం ఆమె పలు వెబ్ సిరీస్ లలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె సినిమాల విషయాలు పక్కన పెడితే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో తన గురించి అనేక విషయాలను షేర్ చేసుకుంది. తనను చాలా మంది లావుగా ఉన్నావు అంటూ బాడీ షేమింగ్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు నిర్మాతలు సినిమాలు విడుదలైన తరువాత కూడా రెమ్యూనరేషన్ ఇవ్వలేదని బాధపడ్డారు.
ఇంకా నటి లిరీష మాట్లాడుతూ..” నాకు చాలా వరకు నెగటివ్ పాత్రలలో నటించడం ఇష్టం. ముఖ్యంగా తమిళ భాషతో పాటు ఇతర భాషలలో కూడా నటించడం ఇష్టమే కానీ అవకాశాలు రాలేవడం లేదు. నాకు పలు సీరియల్స్ కూడా మంచి గుర్తింపు వచ్చింది. చాలా మంది నన్ను లావు ఉన్నావు అంటారు. ఇప్పుడు నేను సన్నగా మారి హీరోయిన్ గా ఏమైన నటించాలా? నాకు ఇలా ఉండటమే ఇష్టం. నాకు లేని బాధ వారికి ఎందుకో అర్ధం కావటంలేదు. అలానే అందరు ఎదుర్కొన్నట్లు నేను డబ్బుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ‘తప్ప సముద్రం’ అనే సినిమాకు రెమ్యూనరేషన్ ఇప్పటి రాలేదు. ఆ నిర్మాతకు ఎన్ని సార్లు ఫోన్ చేసిన.. స్పందనే ఉండదు. చివరకు ఆయనపై కోపంతో విరుచుకపడి మాట్లాడిన కూడా ఫలితం లేకుండా పోయింది. చివరకు నేను డబ్బులు ఇవ్వనని ఆ నిర్మాత అనేశాడు.
ఇలా కొన్ని సినిమాల్లో సగం రెమ్యూనరేషన్ వస్తుంది. ఇక్కడ ప్రొడక్షన్ పెద్దది, మంచిదే అయినప్పటికి మధ్యలో జరిగే కొన్నిటి వలన డబ్బులు మా వరకు రావటంలేదు. చాలా వరకు అలానే జరుగుతున్నాయి” అని ఆమె తెలిపింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘వరుడు’ సినిమాలో 40 రోజులు నటించాను అంటూ ఆ సమయంలో కూడా సగం డబ్బులు రాలేదని తెలిపింది. అలా తను కొన్ని సినిమాలతో పాటు సీరియల్ లలో కూడా చాలా డబ్బులు వదులుకున్నాను అని తెలిపింది. ఇక ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది.