లయ.. ఒక్కప్పటి స్టార్ హీరోలకు హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. కుటుంబ కథా చిత్రాలలో బాగా ఆకట్టుకున్న లయ ఎన్నో అద్భుతమైన సినిమాల్లోనూ తన మార్క్ ను చూపించిందనే చెప్పాలి. స్వయం వరం, దేవుళ్లు, శివరామరాజు, చివరగా అమర్ అక్బర్ ఆంటోని వంటి సినిమాల్లో నటిగా మంచి మార్కులు కొట్టేసింది ఈ హీరోయిన్. ఇక నటిగానే కాకుండా లయ కూచిపూడి డాన్స్, చదరంగం వంటి రంగాల్లో సైతం ఆరితేరింది. అయితే లయ సినిమా ప్రయణంలో ఉన్న సమయంలోనే అమెరికా ఎన్నారై డాక్టర్ ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం కాలిఫోర్నియాలో స్థిరపడింది.
ఇక విషయం ఏంటంటే..? తాజాగా లయ కూతురి శ్లోకాతో పాటు ఓ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. వయసు పెరిగినా తన కూతురితో పోటీ పడి మరి స్టేప్పులు వేసింది లయ. ఆమె డాన్స్ చూసిన కొందరు నెటిజన్స్ అప్పటి లయను ఏ మాత్రం తీసుపోలేద, ఆ అందం, ఎనర్జీ అస్సలు తగ్గలేదంటూ కామెంట్ చేస్తున్నారు. లయ కూతురు శ్లోకా కూచిపూడి డ్యాన్స్ శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలో లయ కూతురి సినిమాల్లో కూడా కనిపించనుందట.