సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న ప్రముఖ తమిళ సినిమాల ఫైట్ మాస్టర్ సురేష్ షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురయ్యారు. క్రేన్ మీదనుంచి కిందపడి చనిపోయారు. ఈ సంఘటన మరువక ముందే ప్రముఖ మలయాళ నటుడు కొచ్చు ప్రేమన్ కన్నుమూశారు. ఈ రెండు విషాదాలతో తల్లడిల్లుతున్న సినిమా పరిశ్రమకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ప్రముఖ హాలీవుడ్ నటి క్రిష్టి ఎలే కన్నుమూసింది. గత కొన్ని నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచింది. 71 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. లిల్లి ప్రిన్స్ స్టీవెన్ సన్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. తన ట్విటర్ ఖాతాలో ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ ప్రపంచ నలుమూలలా ఉన్న మా స్నేహితులందరికి.. ఈ విషయం చెప్పటానికి విచారిస్తున్నాం.
క్యాన్సర్‌తో పోరాడుతూ మా అమ్మ కన్నుమూసింది. మాకు ఎన్నో జ్ఞాపకాలను ఆమె మిగిల్చివెళ్లిపోయారు. సినిమాల్లో గొప్ప నటి మాత్రమే కాదు.. తల్లిగా, అమ్మమ్మగా అంతకంటే అద్భుతంగా బాధ్యతలు నిర్వర్తించారు. మోఫ్పిట్ క్యాన్సర్ సెంటర్ డాక్టర్ల బృందానికి ఎంతో రుణపడి ఉన్నాం. మీ ప్రేమకు, ప్రార్థనలకు కృతజ్ఞతలు. మీరు మా ప్రైవసీని గౌరవిస్తారని అనుకుంటున్నాను’’ అని పేర్కొంది. కాగా, క్రిష్టి ‘‘చీర్స్’’లో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో ఆమె నటనకు గానూ ఆమెకు ఎమ్మీ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం అయ్యాయి. ఆమె పదుల సంఖ్యలో సినిమాల్లో టెలివిజన్ షోలో నటించారు. డ్రాప్ డెడ్, వెరోనికాస్ క్లోసెట్, ఇట్ టేక్స్ టు, సిబ్లింగ్ రివర్లీ వంటి సినిమాల్లో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
— Kirstie Alley (@kirstiealley) December 6, 2022